తెలుగుదేశం కార్యకర్తలను నిలువు దోపిడీ చేసిన లగడపాటి–TNI ప్రత్యేకం

మాజీ ఎంపీ లగడపాటి సర్వే చాలా కుటుంబాల్లో చిచ్చు రేపింది. జాతీయ ప్రసార మాధ్యమాలు టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ప్రకటించగా లగడపాటి మాత్రం మహా కూటమిదే విజయం అంటూ, సమగ్రంగా సర్వే చేశామంటూ ప్రజలను నమ్మించారు. వీరిని నమ్మిన తెలుగుదేశం కార్యకర్తలు భారీగా పందేలు కాశారు. చాలా మంది హైదరాబాద్ తో పాటు మిగిలిన తెలంగాణా ప్రాంతాల్లోని పట్టణాలు, నగరాలకు వెళ్లి మహాకూటమి గెలుస్తుందనే నమ్మకంతో కోట్లల్లో పందేలు కాశారు.
**ఘోరంగా తప్పిన సర్వే లెక్క
లగడపాటి రాజగోపాల్ సర్వేల విషయంలో దిట్టగా పేరున్న ఈ రాజకీయ నేత లెక్క మొట్టమొదటి సారి ఘోరంగా తప్పింది. ఆయన చెప్పిన ఫలితాల లెక్కలు దారుణంగా తప్పాయి. తెలంగాణలో మహాకూటమి 65 సీట్లు పైగా గెలుచుకుంటుందని ఆయన చెప్పినా ఆ లెక్క 20 కూడా దాటలేదు.
టీఆర్ఎస్ కు ఎదురుగాలి వీస్తోందని.. ఆ పార్టీకి 35 కంటే సీట్లు వచ్చే అవకాశం లేదని లగడపాటి తన సర్వేలో చెప్పారు. కానీ ఎవరూ ఊహించని విధంగా 85కు పైగా సీట్లు సాధించి వరుసగా రెండోసారి అధికారం అందుకోబోతోంది. కేసీఆర్ 100కు పైగా సీట్లు సాధిస్తామని చెప్పినా.. చివరకు ఆ సంఖ్యను అందుకోలేకపోయారు.అలాగే ఇండిపెండెంట్లు పది మంది వరకూ గెలుస్తారని చెప్పిన లగడపాటి మాట నిజం కాలేదు. బీజేపీ కూడా అనూహ్యంగా 7 వరకూ సీట్లు గెలుస్తుందని చెప్పినా ఆ లెక్క కూడా తప్పింది. ఓవరాల్ గా లగడపాటి సర్వే అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆయన విశ్వసనీయతను దెబ్బ తీసింది.
**సుహాసిని పై భారీగా బెట్టింగులు.
కూకట్ పల్లిలో తెదేపా అభ్యర్దినిగా పోటీ చేసిన సుహాసిని పై చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలు ఆశలు పెట్టుకున్నారు. ఆమె భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని భావించారు. సుహాసిని గెలుపు పై గుడ్డి నమ్మకంతో కోట్లాది రూపాయలు బెట్టింగులు పెట్టారు. దీనికి తోడూ తెలుగుదేశం పార్టీ అభిమానులు కొన్ని మీడియా సంస్థలు మహాకూటమి గెలుస్తుంది అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారు. డిల్లి నుంచి వచ్చిన మీడియా సంస్థలు గ్రామాల్లో పర్యటించి కచ్చితమైన సమాచారాన్ని అందించగా తేదేపాకు అనుకూలంగా ఉన్న సామాజిక మాధ్యమాల్లో, మీడియా సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించాయి. దీంతో ఎక్కువగా నష్టపోయింది తెలుగుదేశం కార్యకర్తలు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇకనైనా గ్లోబెల్ ప్రచారాలు మానుకుని వాస్తవాలను ప్రజల ముందు ఉంచితే వారికి మేలు చేసిన వారవుతారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com