మరో ఠాగూర్

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వీరి సినిమా సెట్స్‌ మీదకు వెళ్లబోతోందని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా కోసం కొరటాల ‘ఠాగూర్‌’ తరహా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భావోద్వేగపు అంశాలతో పాటు, మంచి సందేశాత్మకమైన సినిమాను చిరుతో తీయాలని కొరటాల భావిస్తున్నారట. పదిహేనేళ్ల క్రితం విడుదలైన ‘ఠాగూర్‌’ చిత్రం చిరు కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే కొరటాల తీయబోయే సినిమాను చిరు తనయుడు రామ్‌చరణ్‌ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరు ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రం రాబోతోంది. నయనతార కథానాయిక. జగపతిబాబు, అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా పూర్తయ్యాకే చిరు తన తర్వాతి ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com