* రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం లోని అడిగుప్ప గ్రామ సమీపంలో అతి ప్రమాదకరమైన పేలుళ్ల పదార్థాలను నిల్వ ఉంచి దక్షిణాది రాష్ట్రాలకు అక్రమంగా తరలించే మాఫియా లో కీలకపాత్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి అని మాజీ మంత్రి టిడిపి పొలిటికల్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.
* ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో నందాదేవి గ్లేసియర్ విరిగి ధౌలిగంగా నదిలో పడటంతో ఆకస్మిక వరద పోటెత్తింది. దీని కారణంగా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, రిషికేష్‌లతోపాటు యూపీలో గంగా పరివాహక ప్రాంతాలలో హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ వరద కారణంగా రిషిగంగ విద్యుత్ ప్రాజెక్ట్ ధ్వంసమైంది. ఇక్కడ పనిచేస్తున్న 100 నుంచి 150 మంది కార్మికులు వరదలో గల్లంతైనట్లు ఉత్తరాఖండ్ సీఎస్ ఓంప్రకాశ్ వెల్లడించారు. సహాయక చర్యలు చేపట్టడానికి వందలాది మంది ఐటీబీపీ పోలీసు సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు ఓ అధికారి వెల్లడించారు. అటు 200 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌తో ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు.
* ఏసీబీ వలలో ఎ-కొండూరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాలసాని శేషుకుమారి 50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వైనం…
* టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో ప్రమాదం తప్పింది.ఆదివారం ఉదయం నరసరావుపేట- చిలకలూరిపేట మార్గంలో వెళ్తుండగా పుల్లారావు కారును మరో కారు ఢీ కొన్నది.ఈ ప్రమాదంలో పుల్లారావు కారు స్వల్పంగా దెబ్బతిన్నది.
* కర్నూల్ జిల్లా ఆదోని మండలం పరిధిలో ఉన్న ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 117 మద్యం కేసుల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం కేసుల్లో సీజ్ చేసిన భారీమొత్తం మద్యం బాటిళ్లను సెబ్ అధికారులు,రెవెన్యూ అధికారులు అందరూ కలిసి పంచనామా నిర్వహించి ఆలూరు రోడ్ సమీపంలో రోడ్డపై వేసి ట్రాక్టర్ తో ఎక్కించి ద్వంసం చేశారు ఈ కార్యక్రమంలో, తాలూకా సిఐ పార్థసారథి,సెబ్,సూపరెండేంట్, ఆర్ సుధాకర్, ఎస్సై రమేష్ బాబు,ఇస్వి స్టేషన్ ఎస్సై విజయలక్ష్మి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
* ప.గో.జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు జెసిబి లు ,మూడుటిప్పర్ లారీలను అడ్డుకుని పోలీసు, రెవిన్యూ శాఖకు సమాచారం అందించిన గ్రామస్థులు.