‘నేను అమెరికాలో స్థిరపడ్డాను. జన్మభూమిపై మమకారంతో పంచాయతీ ఎన్నికల్లో మా అమ్మను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలతో నిధిని ఏర్పాటు చేస్తాను. అర ఎకరం భూమిని సామాజిక భవన నిర్మాణానికి ఉచితంగా ఇస్తాను. లేదా ఇతరులు ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. గ్రామాభివృద్ధికి నా వంతుగా రూ.10 లక్షల విరాళం ఇస్తాను’ అంటూ గ్రామస్థులకు పిలుపునిచ్చారు అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అధిపతిగా ఉన్న అచ్చంపేట మండలం తాళ్లచెరువుకు చెందిన ఎన్‌ఆర్‌ఐ దొండేటి మర్రెడ్డి. గురువారం గ్రామపెద్దలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ పంచాయతీ జనరల్ మహిళకు కేటాయించారు.
మా అమ్మను సర్పంచ్ చేస్తే ₹50లక్షలు ఇస్తాను
Related tags :