తప్పకుండా మాట్లాడాలి

‘‘మహిళలు లైంగిక విషయాల గురించి మాట్లాడటం ఇప్పటికీ మన దగ్గర నిషిద్ధం. ఆ విషయాలను ఎవరూ పెద్దగా ప్రోత్సహించరు. అందులో తప్పేంటో నాకు అర్థం కాదు. ఇప్పటికీ మన దగ్గర మహిళలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాళ్ల జీవన విధానాన్ని బట్టి, వారు ధరించే దుస్తులను బట్టి వారిని సమాజం అంచనా వేయడం శోచనీయం’’ అని అన్నారు తమన్నా. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న తమన్నా తన మనసుకు నచ్చిన పాత్ర గురించి మాట్లాడుతూ ‘‘నేను నటిస్తున్నప్పుడు దర్శకుడు కట్‌ అని చెప్పకుండా ఉంటే బావుంటుందని నాకు ఈ మధ్య తొలిసారి అనిపించింది. కునాల్‌ దర్శకత్వంలో ఏదో మేజిక్‌ ఉంది. ఆయనతో ‘హమ్‌ తుమ్‌’లో పనిచేసిన తర్వాత రాణీముఖర్జీ కీర్తి ప్రతిష్ఠలు ఎంత పెరిగాయో నేను గమనించాను. ఆయన ‘యాక్షన్‌’ అని అనగానే మనం నటిస్తున్నట్టు అనిపించదు. సహజంగా ప్రవర్తిస్తున్నట్టు ఉంటుంది. ‘కట్‌’ అనే పదాన్ని దర్శకుడు వాడకుండా ఉంటే బావుంటుందనిపిస్తుంది. ఆయన రాసిన పాత్ర నచ్చి ‘నెక్స్ట్‌ ఏంటి’లో నా పాత్రకు టామ్‌ అనే నా ముద్దు పేరునే పెట్టమని అడిగా’’ అని అన్నారు తమన్నా.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com