Food

తేనెతో దగ్గు పోతుంది

తేనెతో దగ్గు పోతుంది

అసలే కొవిడ్‌ కాలం. కాస్త దగ్గు వచ్చినా కరోనా ఏమో అని భయపడాల్సిన సమయం. కానీ అది సాధారణమైన దగ్గే అని తేలిపోతే మాత్రం, తగ్గించుకోవడానికి ఓ ఉపాయం ఉందంటున్నారు నిపుణులు. ఆక్స్‌ఫర్డ్‌ అధ్యయనం ప్రకారం, చాలారకాల దగ్గులకు వైరస్సే కారణం. వాటికి యాంటీ బయాటిక్స్‌ వల్ల ఉపయోగం ఉండదు. శరీరం దానంతట అదే సర్దుకోవాల్సిందే. పొడిదగ్గు తగ్గడం కోసం మనం వాడే మందులన్నీ సింప్టమాటిక్‌.. అంటే లక్షణాల నుంచి ఉపశమనం కలిగించేవే! వాటి బదులు తేనె వాడి చూడమంటున్నారు నిపుణులు. తేనె మన గొంతులో ఉండే మ్యూకస్‌ పొర మీద రక్షణ కవచంలా ఏర్పడుతుంది. చిరాకుని తగ్గిస్తుంది. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం, కాస్త తక్కువ మోతాదులో దీన్ని పుచ్చుకోవాలి. ఇక ఏడాదిలోపు చిన్నపిల్లల మీద తేనె ఒక్కోసారి దుష్ప్రభావం చూపే ప్రమాదమూ ఉంది. ఇలాంటి పరిమితుల మినహా… సాధారణ దగ్గు, జలుబుల సమయంలో తేనె దివ్యౌషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు.