Health

మూత్రవిసర్జన ఉగ్గపడితే గుండెపోటు వస్తుంది

మూత్రవిసర్జన ఉగ్గపడితే గుండెపోటు వస్తుంది

చాలామంది మూత్ర విసర్జనను అశ్రద్ధ చేస్తుంటారు. పని ఒత్తిడిలో పడిపోయి ప్రకృతి ధర్మాన్ని దాటేస్తుంటారు. అలా చేయడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని తెలిసిందే! తరచూ ఇలా జరగడం వల్ల మూత్రాశయం చుట్టూ ఉండే కండరాలు బలహీనపడిపోతాయి. యూరినరీ ఇన్ఫెక్షన్లు చోటు చేసుకుంటాయి. కిడ్నీలు దెబ్బతినే ప్రమాదమూ లేకపోలేదు. అరుదైన సందర్భాలలో మూత్రాశయం పగిలిపోయి, ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. తైవాన్‌ విశ్వవిద్యాలయం వారు, ఇప్పుడు మరో సమస్య గురించి కూడా హెచ్చరిస్తున్నారు. మూత్రాశయం నిండిపోవడం వల్ల, గుండె మీద ఒత్తిడి పెరుగుతుందట. దాంతో అది మరింత వేగంగా కొట్టుకుంటుంది. ఫలితం! హృద్రోగులు మూత్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తే, గుండెపోటు వచ్చే ఆస్కారం ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. తస్మాత్‌ జాగ్రత్త!