WorldWonders

42రోజుల మౌనదీక్ష

42రోజుల మౌనదీక్ష

ఎవరైనా కాసేపు మౌనంగా ఉండాలనుకుంటే చేతిలో ఫోనో లేదా ఎదురుగా టీవీనో చూస్తూ గడిపేస్తారు. కానీ కులూలోని తొమ్మిది ఊళ్లు… అవేవీ లేకుండానే 42 రోజులు మౌనవ్రతాన్ని పాటిస్తాయి. అదీ ఎంతో నిష్టగా, ఓ వ్రతంలా చేస్తారు. కాస్త వింతగా ఉన్నా కులూలోని గోషాల్‌, సోలంగ్‌, షనాగ్‌, కోఠీ, పల్చాన్‌, రుఆర్‌, కులంగ్‌, మజాచ్‌, బురువాలో ఈ ఆచారం కనిపిస్తుంది. కొన్ని తరాలుగా దీన్నో సంప్రదాయంలా పాటిస్తున్న ఈ ఊళ్లవాళ్లు… అలా మౌనంగా ఉండటానికి కారణం ఉందని చెబుతారు. ఆ తొమ్మిది ఊళ్ల ప్రజలూ గౌతమ్‌రుషి అనే స్వామిజీని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మకర సంక్రాంతి తరువాత ఆ స్వామిజీ వీళ్ల సంక్షేమం కోసం స్వర్గంలో ధ్యానం చేస్తాడట. దానికి ఎలాంటి ఆటంకం కలిగించకుండా ఉండేందుకే ఇలా మౌనవ్రతాన్ని పాటిస్తారట. మకర సంక్రాంతి తరువాతి నుంచీ మొదలయ్యే ఈ మౌనవ్రతాన్ని ఎంత కఠినంగా చేస్తారంటే అప్పటినుంచీ నలభై రెండు రోజులపాటు వాళ్లు వ్యవసాయం చేయరు. టీవీలూ, రేడియోలూ పెట్టరు. ఫోన్లనూ సైలెంట్‌ మోడ్‌లో ఉంచుతారు. ఆ స్వామిజీ ఉండే ఆలయం తలుపులు కూడా మూసేస్తారట. ఇలా చేయడం వల్ల ఆ ఏడాదంతా తాము బాగుంటామని నమ్ముతారు వీళ్లు.