* శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని డిక్యాతలాన్ స్పోర్ట్స్ స్టోర్ రూమ్ కు బాంబు బెదిరింపు కాల్..స్టోర్ లో బాంబు పెట్టామంటూ స్టోర్ కు కాల్ చేసిన గుర్తు తెలియని దుండగుడు..కోటి రూపాయలు ఇవ్వాలనీ డిమాండ్.. లేకపోతే బాంబును రిమోట్ తో నొక్కి పేలుస్తాంటూ బెదిరింపులు..వెంటనే అప్రమత్తమై స్టోర్ లో వున్న ఉద్యోగులను, కస్టమర్లను బయటకు పంపిన స్టోర్ యాజమాన్యం..ఎయిర్ పోర్ట్ పోలీసులకు పిర్యాదు చేసిన యాజమాన్యం..హుటాహుటిన రంగం లోకి దిగిన పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందం..స్టోర్ లో విస్తృతంగా తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్ బృందం..బాంబు లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు, స్టోర్ సిబ్బంది..కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎయిర్ పోర్ట్ పోలీసులు..ఫోన్ నెంబర్ ఆధారంగా కాల్ చేసిన పోకిరిని అరెస్టు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు..పోలీసుల అదుపులో కేటుగాడు.. లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు..
* కృష్ణా జిల్లా: నందిగామ వీరులపాడు( మం) పెద్దాపురం లో పోలీసులు తనిఖీలు……ఆటో లో తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తన్న 2840 మద్యం సీసాలు, ఇద్దరు వ్యక్తుల ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…..మీడీయా ముందు హాజరు పరిచిన పోలీసులు..గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం…తొలి విడత తొమ్మిది మండలాల్లో ఎన్నికల నిర్వహణ…మొత్తం 379 పోలింగ్ లొకేషన్లో 18 30 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణ.
* ఆర్దిక ఇబ్బందులు తాలలేక ఆత్మహాత్య యత్నం చేసిన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడ్యా తండా గ్రామ ఉప సర్పంచ్ బాబురావు,అతని బార్య రంగమ్మ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతిచెందారు.. కుటుంబం ఆర్ధీక ఇబ్బందులు తాళలేక బార్యా ఇద్దరు పిల్లలతో సహా పురుగు మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారూ. బాబురావు వ్యవసాయం చేస్తూ ఈ మధ్యే ఇల్లు కూడా నిర్మించుకున్నారు. అయితే లాక్ డౌన్ తరువాత పరిస్థితులు గృహనిర్మాణానికి చేసిన అప్పులు, వ్యవసాయానికి చేసిన అప్పులు కూడా పెరగడంతో మానసికంగా కుంగి పోయి తన కుటుంబ సభ్యులు బార్య అయిన రంగమ్మ, పిల్లలు.మోహిన్.(4) మనిశ్విని. (3) పురుగు మంది తాగి ఆత్మహత్య యత్నం చేశారు గమనించిన గ్రామస్థులు ఖమ్మం లోని ప్రయివేట్ హాస్పిటల్ తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబురావు ఆయన బార్య మృతిచెందారు కాగా ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.
* దేవుళ్ళ సాక్షిగా ప్రమాణం చేస్తా పేలుడు పదార్థాల నిల్వకు టిడిపి నాయకులే కారణం— ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
* ఖమ్మం జిల్లా కల్లూరు మండల పరిధిలో పేరువంచ గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాల ఆధీనంలో ఉన్న సుమారు 13 ఎకరాలలో కొంత స్థలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు కేటాయించడం జరిగింది. అట్టి స్థలములో విలువైన చెట్లు ఉండటంతో వాటిని నరికి అమ్ముకున్న సమాచారము ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి మౌలిక వసతులకు ఏర్పాటుకు కావలసిన ఈ కలపను ఎవరు ఏ ఏ అనుమతులతోగానీ లేక అక్రమ పద్ధతులలో గుట్టుచప్పుడు కాకుండా మాయమైన వదంతులు వినిపిస్తున్నాయని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ స్థలంలో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే ఆ శాఖ కు సంబంధిత అనుమతులు తప్పనిసరి కాని పాఠశాల ఆవరణలో ఉన్న కలపకు విద్యా శాఖ నుండి కానీ ప్రభుత్వం నుండి అనుమతులు తప్పనిసరి అయితే ప్రభుత్వ స్థలం లో ఉన్న కలప పై కొంతమంది గుత్తేఒదారులకు కంటపడటంతో కాసులకు కక్కుర్తిపడి పాఠశాలకు అవసరమైన కలపను మాయచేసినట్లు గ్రామంలో గుసగుసలు వినబడుతున్నాయి. ఇంత జరుగుతున్నా పాఠశాల సంబంధించిన వారికి కానీ విద్యాశాఖ గాని తెలియక పోవడం ఆశ్చర్యం. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వ పాఠశాల స్థలములో లక్షల రూపాయల విలువ చేసే కలప కనుమరుగైనదని,ఈ మాయకు సూత్రధారులు ఎవరు అనేది అర్థం కావడం లేదని అన్నారు. ఎంతోమందిని ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దిన పాఠశాలలను ఆదర్శంగా ఉంచుకొని పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ చేయించుకోవాల్సి ఉండగా అక్రమంగా అడ్డదారిలో అమ్ముకోవటం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ప్రజలు అందరికీ ఉపయోగపడే విషయం లో ఇంత జరిగినా నాయకులు,పాలకులు, అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంకా కొంత విలువైన కలప ఆ స్థలంలో ఉండటంతో కలపను తీసుకోవడం కోసం అక్కడకు కొంత మంది రావడంతో సమాచారం అందుకున్న పాఠశాల సిబ్బంది ఇది పాఠశాల కు సంబంధించినది. దీనిని తీసుకెళ్లవద్దని నివారించడంతో అక్కడ వదిలేసి వెళ్లినట్లు తెలిసింది. ఈ పాఠశాల కలప విషయంలో ఎవరు సూత్రధారులుగా వ్యవహరించారో అనేది ప్రశ్నర్థకమే అయిన ఇంతకు అమ్మింది ఎవరు? కొన్నది ఎవరు? దీనికి అనుమతి ఇచ్చింది ఎవరు? అన్న దానిపై విచారణ చేపట్టి మాయమైన కలప విషయంలో చర్యలు చేపట్టాలని ,ప్రభుత్వ స్థలంలో ఉన్న ఎటువంటిది ఐన అక్రమాలకు గాని ఆక్రమణలకు గాని పాల్పడకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
* నూతనంగా ఏర్పడిన ఇరిగేషన్ సర్కిలో కార్యాలయంలో అధికారుల మద్య గొడవ పోలీస్ స్టేషన్ కు చెరిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.వాయిస్ ఓవర్:ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో నూతనంగా ఏర్పడిన ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో సిబ్బంది మద్య గొడవ స్టేషన్ కు చెరింది.కార్యాలయం లో పని చేస్తున్న సినియర్ అసిస్టేంట్ రామకృష్ణ తన విధులకు డైలీ హాజర్ అవుతున్న కావాలనే సెలవ్ వెస్తున్నరని తనకి ప్రమోషన్ ఉండటం చేత కక్ష్య పూరితంగా ఉండి మిగతా సిబ్బంది అంతా నాపై కక్ష్య సాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు.