Movies

మనల్ని మనం అర్థం చేసుకుంటే….

మనల్ని మనం అర్థం చేసుకుంటే….

‘మనల్ని మనం అర్థంచేసుకోవం ఒక అపూర్వ భావన’ అంటున్నారు దక్షిణాది కథానాయిక నిత్యామీనన్‌. ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పులు వ్యక్తిగా తనలో తెచ్చిన పరిణతి గురించి నిత్యా ఇలా వివరించారు. జీవితాంతం ఒకే రకమైన పనిని రొటీన్‌గా చేస్తూ పోవడం నాకు నచ్చదు. సినిమాల విషయంలో కూడా అంతే. ఒక దశలో నేను చేసే సినిమాలు కూడా నాకు అలానే అనిపించాయి. ఇది నా వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రభావం చూపింది. చాలామంది ‘ఈ అమ్మాయికి ఏమైంది ఇంకా మంచి సినిమాలు, పాత్రలు చేయవచ్చు కదా’ అనుకోవడం నా దృష్టికి వచ్చింది. అది నన్ను ఆలోచనలో పడేసింది. దాంతో నన్ను నేను మెరుగుపరుచుకోవాలనుకున్నాను. నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఏం చేస్తున్నాను. ఏం మారాలి? భిన్నంగా ఏం చేయాలి? అని ఆలోచించాను. ఇలా లోతుగా నన్ను నేను అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు నాతో నేను గడిపాను. మన గురించి మనం అర్థంచేసుకోవడం అనేది అదొక అపూర్వ భావన. ఫ ఒక నిర్ణయం తీసుకోవడం, దాన్ని అమలు చేయడం పూర్తిగా మనచేతుల్లో ఉండ దు. కొన్ని సందర్భాల్లో నేను సంతోషంగా ఉండడానికి ఏం చేయాలనుకున్నానో దానికి విరుద్ధంగా జరిగింది. ఇతరులు మనం ఏం చేయాలో డిసైడ్‌ చేయడం వల్ల అలా జరిగింది. ఇప్పుడు నా చుట్టూ ఉండే పరిస్థితులను నాకు అనువుగా మలచుకున్నాను. కొన్ని చిన్న సినిమాలు చూస్తుంటే ఎంత బాగా తీశారో అనిపించేది. ఈ సినిమాలో చేయమని నన్ను ఎందుకు అడగలేదు అనిపించింది. అలాంటి వారితోనే నేను కలసి పనిచేయాలనుకుంటున్నాను అని ఆఖరుకు నాకు అర్థమైంది. కథల ఎంపికలో నాకు పూర్తి క్లారిటీ వచ్చింది.