* అమరావతి భూముల అంశంపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సిట్, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి గడువు కావాలని ప్రతి వాదులు కోరగా.. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 5కి వాయిదా వేసింది. దమ్మాలపాటి కేసును కూడా అప్పుడే విచారిస్తామన్న సుప్రీంకోర్టు.. ఇప్పటికే హైకోర్టులో ఈ కేసు విచారణను జరపొద్దని చెప్పామని జస్టిస్ అశోక్‌భూషణ్ స్పష్టం చేశారు. మార్చి 5న పూర్తి స్థాయి వాదనలు వింటామని తెలిపారు.
* రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రైతుల ఆందోళనలో హింసకు కారణమైన పంజాబీ నటుడు, గాయకుడు, కార్యకర్త దీప్ సిద్దూను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నిర్దేశిత నిబంధనలను ఉల్లంఘించి ఎర్రకోటలో జెండా ఎగుర వేయడం, ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు సిద్దూను అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు మంగళవారం ప్రకటించారు.
* హైదరాబాద్ శివారు నార్సింగి పరిధిలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడిని న్యాయస్థానం దోషిగా తేల్చింది. దోషి దినేశ్‌కుమార్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పరిధిలో 2017 డిసెంబర్ 12న ఆరేళ్ల బాలిక అపహరణకు గురైంది. బాలిక కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. స్థానికంగా ఉన్న నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని బాలిక ఎవరికైనా చెబుతుందోననే భయంతో అక్కడే బండరాయితో మోది హత్య చేశాడు. కొన్ని గంటల తర్వాత నిర్మాణంలో ఉన్న ఓ భవనం సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు, తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
* మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 40 పాస్‌పోర్టులు, రూ.6వేలు స్వాధీనం చేసుకున్నారు. ముఠా అరెస్టుపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ‘మలక్‌పేట్‌లోని గూడ్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలో తనిఖీలు చేశాం. ఒమన్, మస్కట్‌కు మహిళలను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నాం. ఉపాధి పేరిట మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించాం. విదేశాల్లో్ మహిళలను వేధిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ముఠాలో ఉన్న నలుగురిని అరెస్టు చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. విదేశాల్లో మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ఈ ముఠా వారిని వ్యభిచారంలోకి దించుతోంది’ అని సీపీ వివరించారు.
* సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ* పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల్లో అభియోగాల నమోదుపై విచారణ రేపటికి వాయిదా* ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 16కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు* ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు మరోసారి గడువు కోరిన సీబీఐ* ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ ఈనెల 16కి వాయిదా* విదేశాలకు వెళ్లేలా బెయిల్ షరతులు సడలించాలని కోరిన నిమ్మగడ్డ ప్రసాద్* నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేసిన సీబీఐ, నిర్ణయం రేపటికి వాయిదా
* * అ.ని.శా. కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ.* రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరు.* ఓటుకు నోటు కేసు అనిశా పరిధిలోకి రాదన్న అంశంపై హైకోర్టుకు వెళ్తామన్న రేవంత్ రెడ్డి..* హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు కోసం వారం రోజులు గడువు ఇవ్వాలని కోరిన రేవంత్.* అభియోగాల నమోదు ప్రక్రియ వారం రోజులు ఆపాలని కోరిన రేవంత్ రెడ్డి.* అభియోగాల నమోదుపై విచారణ ఈనెల 16కి వాయిదా వేసిన అ.ని.శా. కోర్టు* ఈనెల 16న కచ్చితంగా నిందితులందరూ హాజరు కావాలని స్పష్టం చేసిన అనిశా కోర్టు.* సుప్రీకోర్టు ఆదేశాల మేరకు కేసును త్వరగా తేల్చాల్చి ఉందన్న అనిశా కోర్టు.* ఈనెల 16 తర్వాత రెండు రోజుల్లో వాదనలకు న్యాయవాదులు సిద్ధం కావాలి: అనిశా కోర్టు.