వైకాపా సర్కారు కక్షసాధింపు చర్యలకు భయపడేది లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అచ్చెన్న భావోద్వేగానికి గురయ్యారు. సంబంధంలేని విషయంలో తప్పుడు కేసులు పెట్టారని కంటతడి పెట్టారు. రాష్ట్రంలో జగన్ మోహన్‌రెడ్డికి, వైకాపాకు కింజరపు కుటుంబం గుదిబండలా తయారైందని వ్యాఖ్యానించారు. బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నాయుడికి నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే రమణమూర్తి ఆధ్వర్యంలో సత్యవరం కూడలి వద్ద స్వాగతించారు. తామరపల్లి గ్రామం వద్ద కూడా తెదేపా కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం నిమ్మాడగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి అచ్చెన్నాయుడు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిమ్మాడలో ఓటు వేసిన అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… పంచాయతీ ఎన్నికల్లో స్వార్థం కోసం వైకాపా అనేక కుయుక్తులు పన్నుతోందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు జరుపుతున్నారని ఆరోపించారు. ఆయినా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాభిమానం పొందుతుందన్నారు.
ఏడ్చిన అచ్చెన్న
Related tags :