అగ్రస్థానంలో 123456

కాలం గడిచే కొద్దీ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ అవుతోంది గానీ వినియోగదారులు మాత్రం అలాగే ఉండిపోతున్నారు. ఎందుకంటారా? పాస్‌వర్డ్‌లు నిరంతరం మార్చేందుకు ఎలాగూ బద్దకంగానే ఉంటారు. కాస్త కఠినమైనదైనా పెట్టుకోవచ్చు కదా! 2018లోనూ అత్యంత చెత్త పాస్‌వర్డ్‌గా ‘123456’ నిలిచింది. టీమ్స్ ‌ఐడీ అనే సంస్థ ఈ వివరాలు ప్రకటించింది. ఈ తరహా పాస్‌వర్డ్‌లను సులభంగా గుర్తించొచ్చు. ఆన్‌లైన్‌ సేవల్లో అక్రమంగా వాడుకోనేందుకు ఆస్కారం కల్పిస్తాయి. మొత్తం 100 చెత్త పాస్‌వర్డ్‌లను టీమ్స్‌ ఐడీ వెల్లడించింది. అగ్రస్థానంలో 123456 నిలిచింది. ‘password’ అనే ఆంగ్లపదం రెండో స్థానంలో ఉంది. మూడులో 123456789, నాలుగులో 12345678 ఉన్నాయి. ఇక ఐదులో 12345, ఆరులో 111111, ఏడులో 1234567, ఎనిమిదిలో sunshine, తొమ్మిదిలో qwerty, పదిలో iloveyou నిలిచాయి. వినియోగదారుల ఆన్‌లైన్‌ యాక్టివిటీ అత్యంత రహస్యంగా ఉండాలి. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు, నగదు బదిలీ, నగదు లావాదేవీల అంశాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వ్యవహారాల్లో చెత్త పాస్‌వర్డ్‌లను వాడటం వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏటా కోట్ల రూపాయలను హ్యాకర్లు దొంగిలిస్తున్నా వినియోగదారుల తీరు మారడం లేదు. మీకో సంగతి తెలుసా? princess, admin, welcome, 666666, abc123 పాస్‌వర్డ్‌లు అత్యంత చెత్త -15లో ఉన్నాయి. మీ పాస్‌వర్డ్‌లు ఇవే అయితే వెంటనే మార్చేసుకోవడం చాలా మంచింది. టీమ్స్‌ఐడీ ప్రకారం football, 123123, monkey, 654321, !@#$%^&* (షిప్ట్‌ ప్లస్‌ 12345678 అన్నమాట) చెత్త పాస్‌వర్డ్‌ల కిందే లెక్క. సెమాంటెక్‌ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2017లో 172 బిలియన్‌ డాలర్ల సైబర్‌ నేరాలు నమోదయ్యాయి. సగటున ఒక్కో బాధితుడు 142 డాలర్లు (రూ.10,000) నష్టపోయారు. ఇక భారతీయులు దాదాపు 18.2 బిలియన్‌ డాలర్లు నష్టపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లోని 97.8 కోట్ల వయోజనులు సైబర్‌ నేరాల్లో బాధితులుగా ఉంటున్నారు. అందుకే పాస్‌వర్డ్‌లను పటిష్ఠంగా ఉంచుకోవడం చాలా మంచింది. అక్షరాలు, సంఖ్యలు, ప్రత్యేక చిహ్నాలు పాస్‌వర్డ్‌లో ఉండాలి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com