వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబు

వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు తిరుమల గిరులు ముస్తాబవుతున్నాయి. ఈ నెల 18న వైకుంఠ ద్వార ప్రవేశానికి వేలాదిగా తరలిరానున్న భక్తుల కోసం తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గంటల సమయం క్యూలో వేచి ఉండే అవసరం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ప్రణాళికలు రూపొందించి భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ అనుసంధానంగా నారాయణగిరి ఉద్యానవనంలో పెద్ద ఎత్తున షెడ్లను నిర్మిస్తున్నారు. జర్మన్‌ టెక్నాలజీతో 30 వేల మంది భక్తులు ఈ షెడ్లలో వేచి ఉండేలా వైకుంఠంకు అనుసంధానంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో షెడ్‌లో 2 వేలమంది భక్తులు వేచి ఉండేలా ఈ షెడ్లను నిర్మిస్తున్నారు. 18న వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం 17వ తేదీ ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 30 నుంచి 40 గంటల వరకు స్వామివారి దర్శనానికి భక్తులు వేచి ఉండే పరిస్థితి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో 1.70 లక్షల మందికి మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com