అయిదు కిలోల కవచం

బాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక- ది క్వీన్‌ ఆఫ్‌ ఆ ఝాన్సీ’. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం కోసం కంగన చాలా కష్టపడ్డారట. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో ఆమె ఐదు కిలోల కవచాన్ని ధరించారట. ఈ విషయాన్ని కంగన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడిస్తూ సినిమాలో యుద్ధం చేస్తున్న స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సన్నివేశాల్లో వాడిన ఆయుధాలన్నీ 150 ఏళ్ల నాటివట. ఆ కాలంలో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాడేందుకు ఖడ్గాలు వాడితే.. బ్రిటిషర్లు రాయల్‌ రైఫిల్స్‌ వాడేవారు. అయితే ఆ రైఫిల్స్‌ ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో క్యాప్‌లాక్‌ పిస్టల్స్‌ వాడినట్లు కంగన తెలిపారు. ప్రముఖ హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ కంటే బాగా కంగన యాక్షన్‌ సన్నివేశాల్లో నటించారని స్టంట్‌ డైరెక్టర్స్‌ తెలిపారు. ఈ చిత్రంలో లక్ష్మీబాయికి సన్నిహితురాలైన ఝల్కరీబాయి పాత్రలో బుల్లితెర నటి అంకితా లోఖండే నటించారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తర్వాత కంగన ‘పంగా’ అనే సినిమాలో నటిస్తారు. అశ్విని అయ్యర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇందులో కంగన కబడ్డీ క్రీడాకారిణి పాత్రలో నటించనున్నారు. దీంతో పాటు ఆమె ‘మెంటల్‌ హై క్యా’ సినిమాతోనూ బిజీగా ఉన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com