నేడు అంతర్జాతీయ తేనీటి దినోత్సవం

దేశంలో ఆర్థిక పరమైన తారతమ్యాలు లేకుండా ప్రతీ ఒక్కరిని ఆహ్లాదపరిచే శక్తి తేనీటికి మాత్రమే ఉందంటే అతిశయోక్తికాదు. ఇటువంటి అద్భుత శక్తి కలిగిన తేనీటికి ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు, ప్రత్యేక గౌరవం కలిగించేందుకు ప్రతీ ఏటా డిసెంబరు నెల 15వ తేదీని అంతర్జాతీయ తేనీటి దినోత్సవంగా పరిగణిస్తుంటారు.
***ఛాయ్‌ వాలాగా జీవనం ప్రస్తావనం ప్రారంభించిన నరేంద్రమోదీ దేశ ప్రధానిగా ఎంపికయ్యే ముందు దేశవ్యాప్తంగా ఛాయ్‌పై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా విశేషాదరణ పొందింది. నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా ఎంపిక కావడంలో కీలక పాత్ర పోషించింది. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజయగాధ కన్నా విశేషమైన విశేషమేమిటంటే కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అటక్‌ నుంచి కటక్‌ వరకు దేశ ప్రజలందరిని ఆహ్లాదపరిచిన అంశం చర్చతో పాటు ఛాయ్‌ తాగడం దేశ ప్రజల్లో తాగునీరు తరువాత ప్రజలందరూ ఎక్కువ తాగేది తేనీరు మాత్రమే.
**పరిచయం పెంచుకోవడానికి..
కొంత కాలం క్రితం తమిళసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన విజయవంతమైన చిత్రంలో కథానాయిక ఇంటికి కధానాయకుడి బృందం వెళుతుంది. ఎందుకంటే పరిచయాలు పెంచు కోవడానికి అంటూ చెబుతుంటారు. ఈ విధంగా పరిచయాలు పెంచుకోవడంలో తేనీరు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతీరోజు ప్రతీ సమయంలోను తేనీటిదే కీలక పాత్ర. నిద్రలేచిన తరువాత తొలుత తేనీటిని తాగనిదే రోజు ప్రారంభం కాదు. చలికాలంలో వెచ్చదనాన్ని, వర్షాకాలంలో ఆహ్లాదాన్ని ఆస్వాదించాలంటే నాలుకపై వేడి వేడి తేనీటి చుక్క పడాల్సిందే. మనస్సు ఆనందంతో ఓలలాడాల్సిందే. ఆనందమైనా, ఆవేదనయినా, ఆందోళనైనా, ఆలోచనకైనా తేనీరు తాగడం ప్రతి ఒక్కరికీ అలవాటు. విసుగు చెందినా, విరామం కోరుకున్నా, వెన్నెల్లో హాయిగా ఆనందం పంచుకోవాలన్నా తేనీరు తోడు ఉండాల్సిందే.స్నేహితులు, సన్నిహితులకు తోడు తేనీరు పన్నీరులాగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
**ఎన్ని రకాల టీలో
తొలుత గ్రామీణ ప్రాంతాల్లో తేయాకు పొడిని వేడినీళ్లలో ఉడికించి డికాక్షన్‌ తయారు చేసుకుని, ఇందులో పాలు, చక్కెర కలుపుకొని తేనీటిని ప్రజలు తాగేవారు. తరువాత దీనిస్థానంలో తేయాకు పొడిని పెద్ద మొత్తంలో ఒకే సారి ఉడికించి, ఆ తరువాత అవసరమైనప్పుడు పాలు చక్కెర కలిపి ఇచ్చేవారు. దీన్ని ధమ్‌ టీగా పిలిచేవారు. అయితే ఇప్పుడు పట్టణ ప్రాంతాల మాదిరిగా వివిధ రకాలుగా తేనీరు తయారీ జరుగుతుండటం విశేషం. ఇరానీ టీ, లెమన్‌ టీ, మసాలా టీ, బాదం టీ, కోకో టీ, గులాబీ టీ , చామంతి టీ, జింజర్‌ టీ, పుదీనా టీ, అల్లంటీ, తులసీ టీ, బట్టర్‌ టీ వంటికి అందుబాటులోకి వచ్చాయి. వీటికి చెందిన పొడులు అందుబాటులో ఉన్నందున ప్రతీ ఒక్కరు వివిధ రకాల రుచులు, రంగులు, వాసనలు కలిగిన టీ తాగుతున్నారు.
**ఇప్పుడు గ్రీన్‌ టీదే హవా
ప్రస్తుతం అందరూ వివిధ రకాల టీ తాగినా గ్రీన్‌ టీ తాగడానికి ప్రాధాన్యం పెంచుతున్నారు. ఆరోగ్యంగా ఉంటుందని గ్రీన్‌ టీ సేవిస్తున్నారు. పాలు , చక్కెర లేకుండా సేవించే గ్రీన్‌ టీలో పలు రకాల ఉపయోగాలున్నాయి. గ్రీన్‌ టీని రోజులో ఎప్పుడైనా ఏ సమయంలోనైనా సేవించేందుకు వీలవుతుంది. రాత్రి నిద్రకు ఒక గంట ముందుగా గ్రీన్‌ టీ సేవిస్తే నిద్రించే సమయంలోను శరీరంలో కొవ్వు కరిగిస్తుందని, ఫలితంగా బరువు తగ్గుతున్నట్లు గ్రీన్‌ టీ ప్రియులు నమ్ముతున్నారు. దీంతో పాటు జలుబు, దగ్గు, వంటి శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి. గ్రీన్‌ టీలో కాటెచిన్‌ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లున్నందున, ఇవి శరీరంలో అంతర్గతంగా ఉన్న సమస్యలను దూరం చేసేందుకు ఉపకరిస్తాయి. నిద్రపోయే ముందు గ్రీన్‌ టీ తాగితే ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా నిద్రించేందుకు వీలవుతుంది. మరుసటి రోజు నిద్రలేచే సరికి ఉల్లాసంగా ఉంటుంది.
**ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన టీలు
టీలతో పాటు ప్రపంచంలో వివిధ రకాల టీ పొడులు ప్రాచుర్యంలో ఉన్నాయి. తేనీటి ప్రియులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
*మాచా టీ
ఇది జపాన్‌ దేశంలో పేరు పొందిన టీ. తేయకులను సూర్యకాంతి, ఆక్సిజన్‌ తగలకుండా చేసి మెత్తని పొడి లా చేసి వినియోగిస్తారు. ఈ తేనీరు ఆకుపచ్చగా ఉంటుంది.
*వైట్‌ టీ
పూర్తిగా విచ్చుకోని లేలేత తేయాకు చిగుళ్లను ఏమాత్రం శుభ్రం చేయకుండా ఎండబెట్టిన తరువాత అవి పాలిపోయినట్లుగా తయారవుతాయి. వీటితో తేనీటిని తయారు చేస్తే రంగు ఉండదు. ఇందువలన ఇది వైట్‌ టీగా పిలువబడుతుంది.
*ఎల్లో టీ
ప్రపంచంలో కేవలం చైనా దేశంలోని హూసన్‌, జెజియాంగ్‌, సిచువాన్‌ కొండల మీద పండించే తేయాకుతో మాత్రమే ఎల్లో టీ తయారు చేస్తారు. తేయాకును నేరుగా ఎండబెట్టకుండా, ఆక్సీకరణం చెందించుతూ ఎండ బెడతారు.
*తేయాకుతో సంబంధం లేని రెడ్‌టీ దక్షిణాఫ్రికాలో రాయ్‌బస్‌ అనే మొక్కల ఆకులను ఎండ బెట్టి తయారు చేసే టీని రెడ్‌ టీ అంటారు.
**** ఆంగ్లేయుల నుంచి వలస వచ్చిన టీ అలవాటు మనకు జీవితంలో ఒక భాగమైంది. టీ తాగనిదే పొద్దు గడవదు. చాయ్‌.. చటుక్కున్న తాగరా బాయ్‌.. అంటూ ఓ చిత్రంలో కథనాయకుడు టీ పుట్టుపుర్వోత్తారాలను అసక్తిగా చెబుతాడు. అలనాడు టీ తాగిన బ్రహ్మ అనాటి నుంచి ఈనాటి వరకు విశ్రాంతి లేకుండా సృష్టిని కొనసాగిస్తునే ఉన్నాడంటూ టీ మహత్తును గమ్మత్తుగా వర్ణించాడు. నిజ జీవితంలో తేనెటి ఘుమఘుమలతోనే దీనచర్య ప్రారంభమయ్యే వారు ఎందరో. నేడు అన్ని వేళల్లో టీ తాగడం సర్వసాధారణమైంది. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరు టీని సేవిస్తారు. ఇంటికి వచ్చిన అతిథులుగా మొదటగా మర్యాదాగా అందించేది టీ తోనే.
**ఈ రోజే ఎదుకంటే ?
ప్రపంచ వ్యాప్తంగా తేయాకు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న దేశాలు టీ ప్రాధాన్యాన్ని ప్రచారం చేసేందుకు పలుమార్లు అంతర్జాతీయ సదస్సులను నిర్వహించాయి. ఇందులో భారత్‌ సహా పలు దేశాలు పాల్గొని ఈ దినోత్సవ ఏర్పాటుకు చొరవ చూపాయి. 2005 డిసెంబర్‌ 15న టీ వినియోగం గుర్తించి మనదేశంలో టీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇలా క్రమేనా అన్ని దేశాల్లో నిర్వహిస్తున్నారు.
**ఆరోగ్య ప్రదాయిని..
టీ తాగడం కూడా ఆరోగ్యమే. మానసిక ఉత్తేజం కల్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్గిస్తుంది. రక్తంలోని కొవ్వు పదార్థాలను కరిగిస్తుంది. శరీరంలో చెడు ప్రభావాలను తగ్గించడంలో కొన్ని రకాల టీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటిని నానాటికి ఆదరణ పెరుగుతోంది. గ్రీన్, లెమన్, హనీ, బ్లాక్, అల్లం, మసాలా, బాదం టీలు ఈ జాబితాలో ఉన్నాయి. మధుమేహ బాధితులకు గ్రీన్, బ్లాక్‌ టీలు ఆరోగ్యమని పలు పరిశోధనల ద్వారా తెలిసింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌తో పాటు తెలంగాణలో కూడా వివి«ధ రకాల టీలను సేవిస్తున్నారు. ఇరానీ, అస్సాం, ఫ్లెవర్, చాక్‌లెట్, మసాలా, హెర్బల్, ఇలాచీ, బిస్కెట్‌ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో రకం టీకి ఒక్కో రకం ప్రత్యేకత ఉంటుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com