తెలంగాణా ఫలితాలు ఏపీపై ప్రభావాన్ని చూపలేవు

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై వ్యూహరచన చేశారు. కాంగ్రెస్‌ సీఎంల ప్రమాణ స్వీకారానికి వెళ్లే అంశంపై ఆయన వారితో చర్చించారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సీఎంల ప్రమాణ స్వీకారానికి ఆహ్వానాలు అందాయన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని చంద్రబాబుకు మంత్రులు సూచించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సీఎం, మంత్రులు విశ్లేషించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో పెత్తనం చేయడానికి తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లలేదన్నారు. తెలంగాణలో ఓటమిపై నిరాశ చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా గెలుపు అవకాశాలపై తెలంగాణ ఫలితాల ప్రభావం ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ నెల 17న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాజపాయేతర పార్టీల నేతలతో చంద్రబాబు భేటీకానున్నారు. ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడుతూ.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. లౌకివాద శక్తులన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరైనట్లే అందరూ హాజరుకావాలని ఆకాంక్షించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com