DailyDose

ఫర్నీచర్ షాపు డబ్బాలో కుళ్లిన మృతదేహం-నేరవార్తలు

Crime News - Crime News - Rotten Dead Body In Borabanda Furniture Shop

* ఫర్నీచర్ పాపులో గల డబ్బాలో మృతదేహం లభ్యంకావడం కలకలం రేపుతోంది. బోరబండలోని ఇందిరానగర్ ఫేజ్ 2 సాయి బాబా మందిరంలోని ఓ ఫర్నీచర్ షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది. పాల్ అనే వ్యక్తి సెల్లార్‌‌ను 2017 సంవత్సరం నుండి అద్దెకు తీసుకుని ఫర్నీచర్ షాప్ నడుపుతున్నాడు. అయితే పాల్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పాల్ గత 2 సంవత్సరాలుగా అద్దె చెల్లించకపోవడంతో పాటు.. గత 10 నెలలుగా షాప్ ఓపెన్ చేయడం లేదు. అద్దె చెల్లించని క్రమంలో షాప్‌లో ఉన్న సామాను తీసివేయలని సాయిబాబా మందిరం నిర్వాహకులు షాప్ లాక్ పగలగొట్టి లోపలికి వెళ్లగా ఒక చెక్క డబ్బా నుండి కుళ్ళిన వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్.ఆర్.నగర్ పోలీసులు డబ్బాను తెరవగా మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* ఓ వ్యక్తిని అతని కార్ తో సహా కిడ్నాప్ చేసిన నకిలీ ఆర్మీ అధికారిని అతనితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేసిన కెపిహెచ్బి పోలీసులు.. వాయిస్ ఓవర్ :: కేపీహెచ్బీ కాలనీకి చెందిన తిమ్మిరెడ్డి దిలీప్ అనే వ్యక్తి పాత కార్లు కొని అమ్ముతూ ఉంటాడు. ఇతనికి నాగరాజు కార్తికేయ రఘు వర్మ అనే వ్యక్తి జనవరి 27న తన కారును తాకట్టు పెట్టి 15 వేలు తీసుకున్నాడు. అనంతరం ఈనెల 1న మరి కొంతమంది వ్యక్తులతో వచ్చి దిలీప్ ను అతని కార్ లోనే కేపీహెచ్బీ నుంచి కిడ్నాప్ చేసి జంగారెడ్డిగూడెం వరకు తీసుకెళ్లి బెదిరించి దిలీప్ నుంచి 50 వేల రూపాయలు తీసుకున్నారు. కాగా దీపక్ కుమార్, గడ్డం అనిల్ కుమార్ తో నాగరాజ కార్తికేయ కు పరిచయం ఉంది. గతంలో ఇతను ఆర్మీ సెలక్షన్ కు వెళ్ళాడు అక్కడ సెలెక్ట్ కాకపోయినా ఆర్మీ ఆఫీస్ నంటూ మోసాలు చేయడం ప్రారంభించాడు . ఆర్మీ అధికారి డ్రస్సు, పోలీస్ డ్రెస్ నేమ్ ప్లేట్స్ తో ప్రజలను మోసం చేస్తున్నాడు.

* కావలిపట్టణం లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దుండగులు చేసిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన పట్టణ టిడిపి నాయకులు. నిష్పక్షపాతంగా పోలీసులు విచారణ చేపట్టి దాడి చేసిన దోషులను కఠనంగా శిక్షించాలంటున్న జిల్లా టిడిపి పార్టీ ఉపాధ్యక్షుడు మన్నవ రవిచంద్ర.

* కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తపై భార్య మరుగుతున్న నూనె పోసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హుస్నాబాద్‌కు చెందిన సదయ్య(44), రజిత దంపతులు కుమార్తెతో కలసి దీనబంధు కాలనీలో నివసిస్తున్నారు. కాయగూరల వ్యాపారం చేసే సదయ్యకు భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఆమె పుట్టింటికి వెళ్లి వారం కిందటే వచ్చింది. మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన అతడు భార్యను పిలిచినా స్పందించలేదు. లోపలికి వెళ్లగానే భార్య అతడి కళ్లల్లో కారం చల్లి.. మరుగుతున్న నూనెను మీద పోసింది. అనంతరం కుమార్తెతో కలిసి పరారైంది. సదయ్యను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.