ఆదివారం నుండి ధనుర్మాసం ప్రారంభం

ఈ మాసము శ్రీ మహా విష్ణు వుకు ప్రీతి కరమైనది . శ్రీ వైష్ణవ దేవాలయము లందు చాలా బాగా నిర్వహి స్తారు. ” శ్రీ ఆండాళ్ పాశురాలు ” చదువుతారు .బ్రాహ్మీ మహూర్త మందు స్వామి వారికి పూజలు నిర్వహించి కటు పొంగలి ( దీనినే ముద్గలాన్నం అని పప్పుపోంగలి అని కూడ అంటారు ) నివేదించి భక్తు లకు ప్రసాదములు పంచిపెట్తారు.ఈ మాసములో రకరకాల ప్రసాదాలు చేసి ప్రజలందరికీ ప్రసాద రూపంలో పౌష్టికాహారం అంద చేయటం జరుగుతుంది (ప్రతి చలికాలంలో మన శరీరంలో రక్త మార్పిడి జరుగుతుంది.అందువలన ఆసమయంలో శరీరానికి పుష్టి నిచ్ఛే ఆహారము బీదసాదాలకి అందజేయటానికి మన ఋషులు మునులు చేసిన ఏర్పాటు ఇది )
అనంత శయనమువందున్న విష్ణు చిత్తుడను భ్రాహ్మ ణుని ఏకైక పుత్రిక గోదాదీవి అత్యద్భుత సౌందర్యరాశి . ఆమె తోటలోని పూలను కోసి రకరకములుగ అందంగా పూలమాలలను కట్టి తను ధరించి అద్దమందు తనప్ర తి బింబమును చూచుకొని మురిసి పోవుచూ .ఆమాలలను పదిలంగా తండ్రి కివ్వగా , ఆవిషయము తేలియని ఆమహా భక్తుడు శేషశయనుడు శ్రీ రంగనాథ స్వామి వారికి సమర్పింపగా అర్చకులు స్వామి వారికి అలంకరింపజేసేవారు .

ఇదే విధంగా ప్ర తి రోజూ జరుగ సాగింది .అయితే గోదాదేవి స్వామి వారి రోజు రోజుకూ ప్రేమ ఏర్పడి ఆపరాత్పురునే తన భర్త గా ఊహించుకొనేది . చివరకు ఆనంత శయనుడైన శ్రీ రంగనాథ స్వామి నే వివాహమాడ వలెనని త్రి కరణ శుద్ధిగా నిర్ణయించుకుంది . ఎప్పటివలెనే మాలలను ధరించి తనప్ర క్కనే తన మనోధుడువ్నట్లు గా భావించిమురిసి పోవుచుండెడిది. ఇలాగే ఎల్లకాలం జరుగదుగా .ఒక పర్యాయము పూజార్లు ఆమాలలను అలంకరించు సమయమందు ఆమాలలొ దాగియున్నోపొడవాటి కేశము(వెంట్రుక ) ను కను గోన్నారు. అది స్త్రీ కేశమని తెలుసు కున్నారు. ఆమాలలను తెచ్చిన ఆమహాభక్తునినానాదుర్భాషలాడారు.అంత విష్ణు చిత్తుడు సరాసరి ఇంటికివెళ్ళగా , ఆచ్చటమాలలదంకరించుకుని స్వామి వారి తోభాషించుచున్న పుత్రికను చూచి అమితమైన ఆగ్ర హము తో నిందించి పక్కనే ఉన్నకత్తితో చంపబోగా తన ప్ర ణయ వృత్తాంతమును విసిదపర్చింది .కాని , ఆబ్రాహ్మణుడు ఆమె మాటలు విశ్వసించక అబద్దమాడుతున్నదని భావించి ఆమెను చంపబోగా అదృశ్యరూపుడుగాఉన్న స్వామి ప్ర త్యక్షమై ఆమెదెంత మాత్ర మూతప్పు లేదని ఆమె ధరించిన మాలలే తనకత్యంత ప్రి యమని తెలియ పరచి ఆందరి సమక్షమున శ్రీ రంగనాథస్వామి గోదాదేవినివివాహమాడాడు.

అప్పటినుండిగోదాదేవి ఆండాళ్ గాపిలువబడసాగింది.ఆండాళ్ స్వామి వారిని కీర్తించిన కీర్తనలే పాశురాలు.

విజయనగర సార్వభౌముడైన శ్రీ కృష్ణ దేవరాయలు ” ఆముక్త మాల్యద “అను పేర ( విష్ణు చిత్తియం అనిగూడ అందురు ) గ్రంధరచన గావించెను .ఆముక్తమాల్యద అనగా ‘తీసి వేసినదండ ‘అని అర్థము.

గమనిక :
ఈ మాసమందే వైకుంఠ ఏకాదశి ( ముక్కోటి ఏకాదశి ) వచ్చును. ఆరోజు బ్రాహ్మీ ముహూర్త ముందు అందరూ ఉత్తర ద్వారదర్శనమున స్వామి వారిని దర్శించెదరు .
ఇది ప్రకృతి ఆరాధన
శుభం భూయాత్ !!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com