50శాతం రిజర్వేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లలో రిజర్వేషన్లు 50శాతంగా ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10వ తేదీలోగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లకు సంబంధించి గతంలోనే కొంత సమస్య ఉంది. ఎస్సీ, ఎస్టీలకు దామాషా ప్రాతిపదికన, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. మొత్తం రిజర్వేషన్లు 60శాతానికి పైగా చేరుతున్నాయి. గతంలో సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల 50శాతానికి మించి ఉండకూడదని ఆదేశించింది. ఈనేపథ్యంలో దీనిపై గత కొంతకాలంగా తర్జన భర్జన జరుగుతోంది. ప్రస్తుతం హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో తీసుకొచ్చిన పంచాయతీ రాజ్‌చట్టానికి సవరణ చేస్తూ కొత్త ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌తో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె జోషి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మతో పాటు ప్రజాప్రతినిధులు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com