Politics

గ్రామ వాలంటీర్లకు సత్కారాలు

గ్రామ వాలంటీర్లకు సత్కారాలు

‘పరిపాలనలో మూడో వంతు సమయం గడిచిపోయింది. మధ్య ఓవర్లలోకి వచ్చాం. ఇప్పుడు విశ్రాంతికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు. అదే జరిగితే వెనకబాటు తప్పదు’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. క్రికెట్‌లో కెప్టెన్‌ ఒక్కడి వల్లే గెలుపు సాధ్యం కాదని.. మొత్తం జట్టు సమష్టిగా కృషిచేస్తేనే విజయం సాధ్యమని కూడా అన్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై సచివాలయంలో బుధవారం కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ‘ఇప్పటివరకు ఏం చేశాం? అంతా సవ్యంగా జరిగిందా? ఇంకా ఏమైనా మార్పులు అవసరమా? అన్ని శాఖల మధ్య సమన్వయం ఉందా? వంటి విషయాలపై దృష్టిపెట్టాలి. ప్రజలకు మంచి చేసేందుకు అందరి నుంచి పూర్తి సహాయ, సహకారాలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క అధికారీ నా అంచనాలకు మించి అంకితభావంతో పనిచేశారు. అలాంటి అధికారులు ఉన్నందుకు రాష్ట్ర ప్రజలంతా గర్విస్తున్నారు. ఇప్పిటి వరకూ మీరు అందించిన సహాయ, సహకారాలను ఇక ముందు కూడా కొనసాగిస్తారని మనసారా ఆశిస్తున్నాను’ అని సీఎం జగన్‌ తెలిపారు. ‘రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాం. 20 నెలల్లోనే అన్నింటినీ సాకారం చేసి చూపాం. ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అభినందిస్తున్నాను. సుపరిపాలన అందించడంలో అధికారులందరికీ ఎంతో అనుభవం ఉంది. అందువల్ల మీ శాఖకు సంబంధించిన అంశం కాకపోయినా సరే, ఫలానా శాఖలో ఫలానా మార్పు చేస్తే ఇంకా సుపరిపాలన అందుతుందని భావిస్తే, నిస్సందేహంగా అభిప్రాయాలు, సలహాలు చెప్పండి. అమలులో ప్రభుత్వం సంకోచించదు. మంచి ఆలోచనను నిబద్ధతతో అమలుచేస్తేనే సత్ఫలితాలు వస్తాయి. ఇలాంటి సమావేశాలు తరచూ జరిగితే వివిధ శాఖల మధ్య మరింత సమన్వయం ఏర్పడుతుంది. ఎక్కడైనా సమాచార లోపం ఉంటే, వెంటనే దాన్ని అధిగమించవచ్చు’ అని ఆయన వెల్లడించారు.