తెలంగాణకు ఎవరో వచ్చి రైతుల పరిస్థితి బాగోలేదంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల పార్టీ పెట్టబోతున్న నేపథ్యంలో పరోక్షంగా ఆమెపై విమర్శలు చేశారు. రైతు సంక్షేమానికి తెలంగాణలో అమలవుతున్న పథకాల పట్ల వారికి అవగాహన ఉందా? అని నిలదీశారు. ఏపీలో రైతులకు ఇచ్చే నిధుల కన్నా తమ రాష్ట్రంలో చాలా ఎక్కువ ఇస్తున్నట్లు చెప్పారు. ఏపీలో రైతుకి ఇచ్చేది కేవలం రూ.12,500 అని.. తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే ఇస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఇలా ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై రైతులు ఆలోచించాలని కోరారు.
ఆ పిల్లకి తెలంగాణా పథకాలు తెలుసా?
Related tags :