Movies

వెంకటేశ్ దురదృష్టం

With Drishyam2 Dubbing - Venkatesh Might Not Get A Chance To Remake

దృశ్యం తెలుగు రీమేక్‌లో నటించిన వెంకటేశ్‌ ఇప్పుడు దాని సీక్వెల్‌పైనా దృష్టి సారించాడు. కానీ డైరెక్టర్‌ జీతూ దృశ్యం 2ను తెలుగులో డబ్‌ చేస్తుండటంతో వెంకటేశ్‌కు దాదాపు రీమేక్‌ ఛాన్స్‌ లేకుండా పోయింది. పైగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా ఓటీటీలో అందరికీ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వెంకీ దీన్ని వదిలేసుకునే అవకాశమే అధికంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ సీక్వెల్‌ తెలుగు రీమేక్‌ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం వెంకీ ‘నారప్ప’ సినిమాతో బిజీబిజీగా ఉన్నాడు. ‘అసురన్’‌ రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రం మే 14న విడుదల కానుంది. వరుణ్‌ తేజ్‌తో కలిసి చేస్తున్న ‘ఎఫ్‌ 3’ ఆగస్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించేందుకు వస్తోంది.