Movies

ఆఫ్రికా అడవుల్లో మహేశ్-రాజమౌళి

ఆఫ్రికా అడవుల్లో మహేశ్-రాజమౌళి

మహేశ్‌బాబు అభిమానులకు ఓ త్రిబుల్‌ ధమాకా వార్త. ఆ విశేషాలేంటంటే… రాజమౌళి, మహేశ్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందనే విషయం తెలిసిందే. ఈ సినిమా కథాంశం గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా అడవుల్లో సాగే యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఉండనుందట. ఆఫ్రికన్‌ అడవుల్లో చిత్రీకరణ జరిపే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్‌. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను లాక్‌ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌. 2022లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లొచ్చు.