Devotional

15 నుంచి మోపిదేవి బ్రహ్మోత్సవాలు

15 నుంచి మోపిదేవి బ్రహ్మోత్సవాలు

కృష్ణా జిల్లా మోపిదేవిలో వెలసిన శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల తేది ఖారారు అయింది. ఈ నెల పదిహేను నుంచి వేడుకలను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదిని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి 19 వరకు అత్యంత వైభవంగా జరపనున్నారు. పదహారు, రాత్రి 8 గంటలకు స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నట్టు తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొని… జయప్రదం చేయాల్సిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీడీయన్ లీలాకుమార్ విజ్ఞప్తి చేశారు.