హైదరాబాద్ మేయర్ కు షాక్…!! హైదరాబాద్ మేయర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి ఊహించని షాక్ తగిలింది. మేయర్ పీఠం అధిష్టించి రెండు రోజులు గడువక ముందే జీహెచ్ఎంసీ అధికారులు ఆమెకు అదిరిపోయే ఝలక్ ఇచ్చారు. రూ.లక్ష ఫైన్ కట్టాలంటూ నోటీసులిచ్చారు. మేయర్‌గా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఫిబ్రవరి-11వ తేదీన కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు నగరంలోని ఓ ప్రధాన కూడలిలో భారీ ఫ్లెక్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే, దానికోసం అనుమతి పొందలేదనే కారణంతో జీహెచ్ఎంసీ అధికారులు మేయర్‌కు రూ.1లక్ష జరిమానా విధించారు. బాధ్యతలు చేపట్టిన రెండ్రోజుల్లోనే ఆమెకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో ఏం చేయాలో తోచక టీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
హైదరాబాద్ మేయర్‌కు ఊహించని షాక్
Related tags :