‘‘నేను ఎవరినీ కించపరచలేదు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించండి’’ అని బాలీవుడ్ భామ శిల్పాశెట్టి అన్నారు. వాల్మీకి వర్గాన్ని కించపరిచేలా శిల్పాశెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినందుకుగానూ ఆమెపై ఆ వర్గం ప్రతినిధులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు సల్మాన్‌ఖాన్ మీద కూడా కేసు నమోదైంది. దీని గురించి శిల్పాశెట్టి ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘‘భిన్న జాతులు, మతాలకు ప్రతీకైన భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది. అన్ని మతాలపై నాకు గౌరవం ఉంది. ఇంటర్వ్యూలో నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరినీ కించపరచాలని అనుకోలేదు. క్షమించండి’’ అని తెలిపారు.
శిల్పాశెట్టి క్షమాపణలు
Related tags :