NRI-NRT

కెనడాలో భారతీయులను రేప్ చేస్తాం

కెనడాలో భారతీయులను రేప్ చేస్తాం

కెనడాలో నివసించే భారతీయులకు బెదిరింపులు ఎదురవటంతో.. భద్రత పట్ల కెనడాలోని భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో భారత ప్రభుత్వానికి మద్దతు ప్రకటించటంతో వీరికి పలు బెదిరింపులు ఎదురైనట్టు ఆంగ్ల మీడియా కథనం ద్వారా తెలుస్తోంది. ఇక్కడి భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అత్యాచారం, హింసాత్మక చర్యలకు పాల్పడతామని, వారి వ్యాపారాలను దెబ్బతీస్తామంటూ హెచ్చరికలు ఎదురైనట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలో బెదిరింపులను ఎదుర్కొన్న కెనడా భారతీయులు, ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు వెంటనే తెలియచేయాల్సిందిగా కెనడాలో భారతీయ హై కమిషనర్‌ అజయ్‌ బసారియా సూచించారు.