వార్నర్ చెప్పాడు. నేను చేసేశాను.

తనను బాల్‌ ట్యాంపరింగ్‌ చేయాలని ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రోత్సహించాడని ఆస్ట్రేలియా క్రికెటర్‌ కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ అన్నాడు. ఈ చర్యకు తాను సరిగ్గా సరిపోతానని, జట్టులో తన విలువ పెరుగుతుందని భావించానని వెల్లడించాడు. కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో బాన్‌క్రాఫ్ట్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ చేశాడు. కెమెరాల్లో ఇదంతా రికార్డైంది. ఈ నేపథ్యంలో సారథి స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌పై ఏడాది పాటు, బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు. ‘మ్యాచ్‌పై మేం పట్టు సాధిస్తున్నప్పుడు డేవిడ్‌ వార్నర్‌ నా చేతికి బంతి ఇచ్చాడు. బ్యాల్‌ ట్యాంపర్‌ చేయాలని ప్రోత్సహించాడు. అంతకన్నా నాకేమీ తెలియదు. ఈ పనిని నేను సరిపోతానని, విలువ పెరుగుతుందని అనుకున్నా అంతే. అప్పటికి నాకున్న విలువలు, సమయాన్ని బట్టే ఈ పని చేశాను. కానీ అదెంత పెద్ద పొరపాటో ఇప్పుడు తెలిసింది. నేను అందరినీ అవమానించానని అనిపిస్తోంది. మేం గెలుపు అవకాశాలను నాశనం చేసుకున్నాం. నిజం ఎప్పటికీ బాధిస్తుంది. ఈ చర్య ఏం తెచ్చింది? క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంత నిజాయతీతో ఉందో తెలుసుకోవాలి. కొన్ని మార్పులు చేయాలి’ అని గిల్‌క్రిస్ట్‌తో ముఖాముఖిలో బాన్‌క్రాఫ్ట్‌ అన్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com