అది 1953, ఫిబ్రవరి. అప్పుడు అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన జో లైగన్ వయసు 15 ఏళ్లు. తెలిసీ తెలియని ఆ వయసులో లైగన్ ఓ నేరానికి పాల్పడ్డాడు. మరో నలుగురు టీనేజీ కుర్రాళ్లతో కలిసి దోపిడీలో పాల్గొన్నారనే ఆరోపణలు వచ్చాయి. వారి ముఠా చేసిన దోపిడీ ఘటన ఇద్దరు వ్యక్తుల మరణానికి దారి తీసింది. మరో ఆరుగురు గాయాల పాలయ్యారు. దీంతో పోలీసులు లైగన్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారించిన న్యాయస్థానం లైగన్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఆదేశించింది. దీంతో లైగన్ 15ఏళ్ల వయసులోనే జైలు జీవితంలోకి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జైలుకు వెళ్లిన ఆ వ్యక్తి ఇప్పుడు 83ఏళ్ల వయసులో విడుదలయ్యాడు.
68 ఏళ్లు జైల్లో మగ్గిన అమెరికన్
Related tags :