NRI-NRT

బోర్డులో చర్చించాక చర్యలు తీసుకుంటాం

TANA Leadership Releases Clarification On Membership Fraud

తానా ఎన్నికలలో సభ్యుల చిరునామాలకు సంబంధించి ఎలాంటి అపోహలకు తావులేదని తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, బోర్డు చైర్మన్ హరీష్ కోయ, కార్యదర్శి పొట్లూరి రవి ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులందరికీ ఓటు వేసే హక్కు కల్పించే ఉద్దేశ్యంతో చిరునామాల మార్పుకు సంబంధించి సభ్యులకు సమాచారం అందించడం జరిగిందని, చాలా మంది సభ్యులు తమ చిరునామాల మార్పుకు సంబంధించి గుర్తింపు పత్రాలు పంపారని, అన్నీ రకాలుగా దృవీకరించుకున్నతర్వాతే చిరునామాల మార్పు మీద నిర్ణయం ఉంటుందని తెలిపారు. సభ్యుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని బోర్డులో కూలంకషంగా చర్చించిన మీదట క్షుణ్ణంగా తనిఖీ చేసి నివేదిక రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ నివేదిక ప్రకారం తదుపరి చర్యలుంటాయని అప్పటిదాకా చిరునామాల మార్పు జరగదని తెలిపారు. టెక్సాస్ రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితుల ప్రభావంతో పోస్టల్ సర్వీసులు ఆగిపోయిన దృష్ట్యా 13వ తారీఖున చేరాల్సిన నామినేషన్ల గడువును మంగళవారం 23 ఫిబ్రవరి వరకు పొడిగించినట్లు తెలిపారు. 13వ తేదీన లేదా 13వ తేదీ కంటే ముందు డెలివరీ డేట్ ఉన్న నామినేషన్లకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపారు.