*షిర్డీలో నైట్ కర్ఫ్యూ.. బాబా దర్శన వేళల్లో మార్పు
ప్రస్తుతం మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అక్కడ కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు.
★ ఈ నేపథ్యంలో షిర్డీలోని సాయిబాబా ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేశారు.
★ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే సాయిబాబా దర్శనం ఉంటుందని అహ్మద్‌నగర్ జిల్లా కలెక్టర్ తెలిపారు.
★ ప్రతి రోజు కేవలం 15 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు ఆలయ బోర్డు పేర్కొన్నది.
★ కోవిడ్ మహమ్మారి వేళ ఏడు నెలల బ్రేక్ తర్వాత ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.