కేరళలో యుద్ధ వాతావరణం. బస్సులపై దాడులు.

కేరళలోని పవిత్ర శబరిమల అయ్యప్ప ఆలయాన్ని 50ఏళ్ల వయసులోపు ఇద్దరు మహిళలు దర్శించుకోవడం పెను దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. మహిళలు ఆలయంలోకి ప్రవేశించడంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ నిర్వహించారు. ఆందోళనకారుల అల్లర్ల కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరో భాజపా కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 266 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పాటు ముందస్తు జాగ్రత్తగా మరో 334 మందిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కేరళ అల్లర్ల ప్రభావం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలపైనా పడింది. బంద్‌ కారణంగా కేరళలో కర్ణాటక రవాణా శాఖకు చెందిన బస్సులపై దాడి చేశారు. దీంతో కర్ణాటక రాష్ట్ర రవాణాకు రూ.10లక్షల మేర నష్టం వాటిల్లింది. ఇక తమిళనాడుకి చెందిన హిందూ సంస్థల కార్యకర్తలు శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ కోయంబత్తూర్‌లోని రైల్వే స్టేషన్‌లో రైల్‌ రోకో నిర్వహించేందుకు ప్రయత్నించారు. హిందూ మక్కల్‌ కత్చికి చెందిన కార్యకర్తలు రైల్వే స్టేషన్‌లో ఆందోళనలు చేపట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాజపాకు చెందిన న్యాయవాదులు 15 మంది కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు. బంద్‌ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ కేరళకు వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసింది. శబరిమలలోకి మహిళలు ప్రవేశించడాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com