అర్థరాత్రి మిస్డ్ కాల్స్‌తో కోటిన్నర చోరీ

ఫోన్‌కు వచ్చిన ఆరు మిస్డ్‌ కాల్స్‌ ద్వారా ఓ వ్యాపారవేత్త దగ్గర నుంచి సైబర్‌ నేరగాళ్లు కూ.1.86కోట్లను కొట్టేశారు. ముంబయిలో గత నెల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త ఫోన్‌కు డిసెంబరు 27 రాత్రి నుంచి 28 మధ్యలో ఆరు మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయి. ఉదయం ఆయన నిద్రలేచాక ఆ నెంబర్లకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించగా సిమ్‌ బ్లాక్‌ అయినట్లు గుర్తించాడు. వెంటనే సదరు సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఫోన్‌ చేయగా.. అతడి ఫోన్‌ నుంచి బ్లాక్‌ చేయమని రిక్వెస్ట్‌ రావడంతోనే అలా చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా అదే నెంబరు మీద కొత్త సిమ్‌ తీసుకునేందుకు కూడా రిక్వెస్ట్‌ వచ్చిందని చెప్పారు. బ్యాంకు ఖాతాకు ఫోన్‌ నెంబరు లింక్‌ ఉండటంతో వెంటనే ఆయన బ్యాంకు ఖాతాను పరిశీలించాడు. బ్యాంకుకు వెళ్లగా అతడి ఖాతా నుంచి రూ.1.86కోట్లు వేరే ఖాతాలకు మళ్లినట్లు గుర్తించాడు. వెంటనే ఆయన ముంబయి సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. సైబర్‌ నేరస్థులు సిమ్‌ స్వాపింగ్‌ ద్వారా వ్యాపారవేత్త బ్యాంకు ఖాతా నుంచి నగదు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. సిమ్‌ స్వాపింగ్‌ చేసి అదే నెంబరు మీద రెండో సిమ్‌ కార్డు తీసుకొని ఓటీపీ ద్వారా నగదు మళ్లించినట్లు సైబర్‌ నిపుణులు తెలిపారు. సదరు వ్యాపారవేత్త బ్యాంకు ఖాతా నుంచి 28 లావాదేవీలు జరిగి, 14 ఖాతాలకు నగదు మళ్లినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన బ్యాంకు అధికారులు రూ.20లక్షల వరకు వెనక్కి రాబట్టగలిగారు. కానీ మిగతా నగదు మాత్రం అప్పటికే విత్‌ డ్రా చేయడంతో వెనక్కి తీసుకురాలేకపోయారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com