* ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కలకలం. ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలు ఉన్న కారును గుర్తించిన పోలీసులు. ముకేశ్ నివాసం వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ బృందాలు.
* పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి రూ.14వేల కోట్లు ఎగవేసి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అక్కడి కోర్టు షాకిచ్చింది. నీరవ్‌పై మనీలాండరింగ్ అభియోగాలు రుజువయ్యాయని పేర్కొంది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని లండన్ కోర్టు తీర్పు వెలువరించింది. భారత్‌కు అప్పగించినా నీరవ్‌కు అన్యాయం జరగదని పేర్కొంది. అలాగే నీరవ్ మానసిక స్థితి సరిగా లేదన్న వాదననూ కొట్టి పారేసింది.మనీలాండరింగ్ విషయంలో భారత్ సమర్పించిన ఆధారాలు సరిపోతాయని అభిప్రాయయపడిన కోర్టు.. అతడిని భారత్‌కు అప్పగించాలని తీర్పు వెలువరించింది. తమ ఉత్తర్వులపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. నీరవ్ చట్టబద్ధంగా వ్యాపారం చేశారనడాన్ని తాను నమ్మడం లేదని, లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తాను విశ్వసిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
* అట్టుడికిన నరసరావుపేట.డిగ్రీ విద్యార్థిని హత్యతో పట్టణంలో ఉద్రిక్తత.నరసరావుపేటలోని పల్నాడులో రోడ్డులో ధర్నా చేసిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డాల్ల్ చదలవాడ అరవింద బాబు,విద్యార్థులు, ప్రజా సంఘ నాయకులు.నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూషను దారుణంగా హతమార్చడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.హంతకుడిని కఠినంగా శిక్షించాలని నరసరావుపేట టీడీపీ నేతలు, విద్యార్థులు, పలు సంఘాలకు చెందిన నేతలు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించడంతో నరసరావుపేటలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.విద్యార్థిని అనూష హత్యకు గురైనట్లు మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహం చూసి భోరున విలపించారు.తమ కుమార్తెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నాడని, గుండెలలిసేలా తల్లిదండ్రులు విలపించారు.
* అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని కోరుతూ జేసి ప్రభాకర్ రెడ్డితో పాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
* నూజివీడు మండలం మీర్జాపురం వద్ద తెల్లవారు జామున నాలుగున్నర ప్రాంతంలో మెటల్ లోడుతో వెళుతున్న లారీ బీభత్సం.రోడ్డుపై వెళుతున్న గొర్రెల మంద పై దూసుకెళ్లిన లారీ 45 గొర్రెలు మృతి.న్యాయం చేయాలని భాదితుల రోదన.
* వైసీపీ నేతలు అమ్మవారి సంపదను దోచుకుంటున్నారు.ఏసీబీ తనిఖీలు చేస్తేనే.. వందల కోట్ల అవినీతి జరిగిందని తేలింది.మంత్రి వెల్లంపల్లి, ఈవోకు తెలియకుండా ఇంత దోపిడీ ఎలా జరుగుతుంది.జగన్‍రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి.అన్ని ఆలయాల్లో జరిగిన అవినీతిపై సీపీఐ విచారణ చేయించాలి .—ఎంపీ కేశినేని నాని
* కుప్పం – పలమనేరు జాతీయ రహదారి పిఈయస్ ఆసుపత్రి సమీపంలో కారును ఢీ కొన్న ప్రైవేటు బస్సు…కారులో ప్రయాణిస్తున్న వారు వి.కోట మండలం పట్రపల్లికి చెందిన వ్యక్తులుగా గుర్తించిన పోలీసులు..డయాలసిస్ చెకప్ కొరకు పీఈయస్ ఆసుపత్రికి వచ్చి వెళ్తుండగా గణేష్ పురం వద్ద రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది…ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు…పరారీలో బస్సు డ్రైవర్..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.