దుబాయిలో వెంకన్న వివాహం

దుబాయిలో ఫిబ్రవరి 1న శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. అజ్మన్‌ సిటీ సెంటర్‌ పక్కన గల అల్‌జర్ఫ్‌ హబిటాట్‌ స్కూల్‌లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుప్రబాతసేవ, 8 నుంచి 9 గంటల వరకు తోమాలసేవ, 9 నుంచి 10 గంటల వరకు 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది. 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుకల్యాణం నిర్వహిస్తారు.మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు సర్వదర్శనం, 4 నుంచి 5 గంటల వరకు విష్ణుసహస్రనామం, 5నుంచి గరుడ సేవ ఉంటుం ది. యూఏఈలో మొదటిసారిగా స్వామివారి గరుడసేవ నిర్వహిస్తున్నారు. వైభవోపేతంగా జరిగే స్వామివారి కల్యాణ వేడుకలో పాల్గొనే వారు +971555794466, +971585771709 నంబర్లలో సంప్రదించవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com