దయచేసి ఆపండి

ఆస్ట్రేలియా క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీపై మాజీ ఆటగాడు షేన్‌వార్న్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ఇకనైనా చెత్త ఎంపికలను ఆపేయాలని సూచించాడు. ప్రపంచకప్‌ ముందు టీమిండియాతో మూడు వన్డేలకు ఎంపిక చేసిన జట్టు చెత్తగా ఉందని పేర్కొన్నాడు. ఆసీస్‌ ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో పీటర్‌ సిడిల్‌, ఉస్మాన్‌ ఖవాజా, నేథన్‌ లైయన్‌ను తీసుకున్నారు. ‘ఇప్పుడే ఆస్ట్రేలియా జట్టును చూశా. అవమానకరంగా కొందరిని తొలగించారు. మరికొందర్ని ఎంపిక చేయడం చూస్తే ఏ మాత్రం ఆలోచించినట్టు లేదు. ఆసీస్‌ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో ఇలాంటి చెత్త ఎంపికలకు ముగింపు పలకాలి. డీఆర్సీ షార్ట్‌ను ఎందుకు తీసేశారో అర్థం కాలేదు. అతడేం తప్పు చేశాడో తెలియడం లేదు. బ్యాటు, బంతితో రాణించగలడు. మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫించ్‌తో కలిసి టాప్‌ ఆర్డర్‌లో శుభారంభాలు అందించాడు. జట్టు సమతూకంగా లేదు. ఇప్పుడు ఎంపిక చేసిన ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో ఎలా రాణిస్తారో చూడాలి. అక్కడి ఫ్లాట్‌ పిచ్‌లు కాస్త స్పిన్‌కు అనుకూలిస్తాయి. తెలివైన బౌలర్లు అవసరం. అక్కడ చిన్న మైదానాలు ఉంటాయి. అందుకే పవర్‌హిట్టింగ్‌ చేసే ఆటగాళ్లు కావాలి. ఫామ్‌లో లేని వారిని ఎంపిక చేసి బాగా ఆడుతున్న వారిని పక్కన పెట్టడం అస్సలు బాగాలేదు’ అని షేన్‌వార్న్‌ అన్నాడు. 14 మంది ఆటగాళ్లతో తన సొంత జట్టును విడుదల చేశాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com