అణుబాంబు కాదు. కానీ అంత శక్తిమంతం.చైనా వద్ద సాంకేతికత.

అమెరికా ప్రయోగించిన ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ అనే బాంబుకు దీటుగా.. చైనా కూడా అంతటి సామర్థ్యం గల బాంబును రూపొందించినట్లు తెలుస్తోంది. హెచ్‌- 6కె అనే బాంబర్‌ సాయంతో దానికి పరీక్షించినట్లు చైనా మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ మేరకు… ‘చైనా అమ్ములపొదిలో ఉన్న అతి శక్తిమంతమైన బాంబు చేరింది. దీనికి మదర్‌ ఆఫ్‌ ఆల్‌బాంబ్స్‌ అని నామకరణం చేశారు. చైనా రక్షణ సంస్థ ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ రూపొందించిన ఈ బాంబును అణు బాంబులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. దీనిని ఉపయోగించి అత్యధిక స్థాయిలో విధ్వంసాన్ని సృష్టించవచ్చు’ అని ట్వీట్‌ చేసింది. కాగా మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌గా చైనా చెప్పుకొంటున్న ఈ బాంబును పరీక్షించిన వీడియోను.. ఆ దేశ రక్షణ సంస్థ నార్త్‌ ఇండస్ట్రీస్‌ గ్రూప్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌ఓఆర్‌ఎన్‌సీఓ ) తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. తద్వారా తమ వద్ద కూడా అణు బాంబులకు ప్రత్యామ్నాయ, అత్యంత శక్తిమంతమైన బాంబులు ఉన్నాయని చైనా.. ప్రపంచ దేశాలకు ముఖ్యంగా అమెరికాకు పరోక్ష హెచ్చరికలు జారీచేసింది. హెచ్‌-6కె అనే బాంబర్‌ ద్వారా దీనిని ప్రయోగించినట్టు పేర్కొంది. ఈ విషయం గురించి ఓ అధికారి మాట్లాడుతూ.. అమెరికా రూపొందించిన బాంబు కంటే తాము రూపొందించిన ఈ బాంబు అత్యంత చిన్నది, తేలికైనదని, దీనిని మోసుకువెళ్లేందుకు పెద్ద పెద్ద ఎయిర్‌క్రాఫ్టులు అక్కర్లేదని తెలిపారు. ఇక అఫ్గనిస్తాన్‌లో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అమెరికా సైన్యం.. గతేడాది జీబీయూ-43/బి అనే బాంబును ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీనికి ‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ అనే పేరు పెట్టారు. ఈ క్రమంలో చైనా కూడా తమ కొత్త బాంబుకు అదే పేరు పెట్టి.. అగ్రరాజ్యానికి సవాల్‌ విసిరింది. కాగా రష్యా కూడా ఇటువంటి బాంబునే తయారు చేసి దానికి ‘ఫాదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’గా నామకరణం చేసింది. అత్యంత పెద్దది, థర్మోబరిక్‌ అయిన ఈ బాంబు గ్యాస్‌ను ఉపయోగించుకుని… పెద్ద పెద్ద ఫైర్‌బాల్స్‌ను విసరడం ద్వారా లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. అయితే చైనా రూపొందించిన బాంబు మాత్రం థర్మోబరిక్‌ బాంబు కాదని గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com