తానాలో ఎన్నికల వేళ లేఖల వ్యవహారం ముదురుతోంది. తాజాగా తానా తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరికి మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్ ఫేస్‌బుక్ వేదికగా ఘాటు లేఖ సంధించారు. తానా చరిత్రలో ఆయన ఎన్నిక అనూహ్య పరిస్థితుల్లో సంభవించిందనే విషయాన్ని ఆయన మరిచిపోకూడదని పేర్కొన్నారు. 2021 ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని తటస్థంగా ఉండమని ప్రోత్సహిస్తూనే ఆయన మాత్రం ఒక ప్యానెల్‌కు డిక్టేటర్ తరహాలో మద్దతు తెలపడం భావ్యం కాదని అన్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం తానాను రెండేళ్ల పాటు ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మాత్రమే ఆయనదని, ముఠా రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. అంజయ్యకు తన మద్దతుదారులు దూరం అవుతున్నారనే భయంతోనే ఆయన ఇలాంటి చర్యలకు పూనుకున్నారని నాదెళ్ల గంగాధర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
తానా తదుపరి అధ్యక్షుడు అంజయ్యకు నాదెళ్ల ఘాటులేఖ
Related tags :