గిన్నిస్ ఎక్కిన పోలవరం

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో సోమవారం రెండు ప్రపంచ రికార్డులు ఆవిష్కృతమయ్యాయి. గతంలో చేపట్టిన 21,580 క్యూబిక్‌ మీటర్ల పనులను 16 గంటల్లోనే నవయుగ సంస్థ అధిగమించింది. 24 గంటల్లో 32,315 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులతో గిన్నిస్‌ రికార్డుకెక్కింది. ప్రపంచ రికార్డు స్థాయిలో కాంక్రీట్‌ను నవయుగ సిబ్బంది డంప్‌ చేశారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఈ రోజు ఉదయం 8గంటల వరకు నిరంతరాయంగా కాంక్రీట్‌ పోసి రికార్డు సృష్టించారు. దీంతో పోలవరం పనుల్లో రికార్డు నమోదైనట్టు గిన్నిస్‌ రికార్డు ప్రతినిధులు ప్రకటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు వద్దే ప్రతినిధులు గిన్నిస్‌ రికార్డు ధ్రువపత్రాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com