నా హృదయం దొంగిలించింది-యువకుడి ఫిర్యాదు

నాగపూర్‌ పోలీసులకు ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. ఓ యువకుడు తన హృదయం దొంగతనానికి గురైందని ఫిర్యాదు ఇవ్వడమే అందుకు కారణం. అతడి ఫిర్యాదుతో ఆశ్చర్యపోవడం పోలీసుల వంతైంది. ఓ యువతి తన హృదయాన్ని దొంగలించిందని, అందుకే ఫిర్యాదు చేయాలనుకుంటున్నానని తెలిపాడు. వెంటనే తన హృదయం తనకు ఇప్పించాలని పోలీసులను కోరాడు. సాధారణంగా పోలీసులకు వస్తువులు పోయాయని ఫిర్యాదులు వస్తాయి. కానీ ఈ చిత్రమైన ఫిర్యాదు రావడంతో ఏం చేయాలో అర్థంకాక సదరు పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది ఉన్నతాధికారులను సంప్రదించారు. ఈ విషయమై చర్చించిన అనంతరం ఇలాంటి ఫిర్యాదులకు సంబంధించి భారత్‌లో ఎలాంటి చట్టాలు లేవని, తాము ఈ సమస్యను పరిష్కరించలేమని ఆ యువకుడికి వెల్లడించారు. ఓ దొంగతనం కేసులో రూ.82లక్షల వస్తువులను స్వాధీనం చేసుకొన్న అనంతరం నాగపూర్‌ పోలీసు కమిషనర్‌ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక్కోసారి తాము పరిష్కరించలేని కొన్ని ఫిర్యాదులు వస్తుంటాయని ఆయన తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com