ప్రశ్నా పత్రాలు కొనుక్కుని పాసయ్యాడు

తన కుమారుడు సల్మాన్‌ఖాన్‌ ప్రశ్నా పత్రాలు లీక్‌ చేస్తే పరీక్షలో పాస్‌ అయ్యాడని రచయిత సలీం ఖాన్‌ చెప్పారు. సల్లూభాయ్‌కు చిత్ర పరిశ్రమలో ఎంత క్రేజ్‌, పేరుందో అందరికీ తెలిసిందే. నటుడిగా ఆయన తారాస్థాయిలో ఉన్నారు. తన చక్కటి నటనతో విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు. గత 30 ఏళ్లుగా వెండితెరపై సందడి చేస్తూ అనేక బ్లాక్‌బస్టర్లు అందుకున్నారు. అయితే అలాంటి ఆయన ప్రశ్నా పత్రాలు లీక్‌ చేస్తే పాస్‌ అయ్యాడని కపిల్‌ శర్మ షోలో సలీం బయటపెట్టారు. ఈ షోలో సలీంతో పాటు ఆయన కుమారులు సల్మాన్‌ ఖాన్‌, అర్బాజ్‌ ఖాన్‌, సొహైల్‌ ఖాన్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. ‘మా ఇంటికి గణేశ్‌ అనే వ్యక్తి వస్తుండేవాడు. నా కుమారులు నా కంటే ఆయనకే ఎక్కువ గౌరవం ఇవ్వడం గమనించా. అందుకే ఆయన గురించి ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన నా కుమారులకు లీకైన ప్రశ్నా పత్రాల్ని తెచ్చి ఇచ్చేవాడని తర్వాత తెలిసింది’ అని అన్నారు. గణేశ్‌ ఆ పత్రాల్ని తన కోసం తీసుకొచ్చేవాడని అనంతరం సల్మాన్‌ చెప్పారు. సల్లూభాయ్‌ ప్రస్తుతం ‘భారత్‌’ సినిమాలో నటిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌‌ దర్శకత్వం వహిస్తున్నారు. కత్రినా కైఫ్‌ కథానాయిక. దిశా పటానీ, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క సల్మాన్‌ ‘దబాంగ్‌ 3’, ‘ఇన్షాఅల్లా’ (పరిశీలనలో ఉన్న టైటిల్‌) సినిమాల్లో నటిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com