భారత్ లో దూసుకుపోతున్న జాగ్వార్-వాణిజ్య వార్తలు-01/09

* టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) గతేడాది భారత్‌లో 4,596 వాహనాలు విక్రయించింది. 2017లో విక్రయించిన 3,954 కార్లతో పోలిస్తే ఇవి 16.23 శాతం అధికం. కంపెనీ ఒక ఏడాదిలో నమోదు చేసిన అత్యధిక విక్రయాలు ఇవే కావడం విశేషం.
*ఆన్‌లైన్‌లో వైద్యుల సేవలను పొందడంతో పాటు, వారి అపాయింట్‌మెంట్‌ తీసుకోవడం, రోగ నిర్థారణ కేంద్రాల్లో చేయించుకునే వైద్య పరీక్షలకు రాయితీలు ఇవ్వడం లాంటి సేవలతో డాక్‌ప్రైమ్‌ డాట్‌కాం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.
*ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) భారత సైన్యం నుంచి రూ.760 కోట్ల విలువైన క్షిపణి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది.
*టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) గతేడాది భారత్‌లో 4,596 వాహనాలు విక్రయించింది. 2017లో విక్రయించిన 3,954 కార్లతో పోలిస్తే ఇవి 16.23 శాతం అధికం.
*జీఎంఆర్‌ గ్రూపు నిర్వహిస్తోన్న హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ పనులను టర్కిష్‌ సంస్థ సెలెబీ ఏవియేషన్‌ హోల్డింగ్‌ చేజిక్కించుకుంది.
* ప్రభుత్వ రంగ ఖనిజాల సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు (ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌) చేయనుంది. ఎన్‌ఎండీసీ బోర్డు డైరెక్టర్ల సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
*విక్రయశాలలో అయినా, ఆన్‌లైన్‌లో అయినా స్మార్ట్‌ ఫోన్‌ కొన్నాక, పొరపాటున చేజారి తెర (స్క్రీన్‌) పగిలితే సంబంధిత కంపెనీ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. వీటిని వెతుక్కుంటూ వెళ్లడం, అధికమొత్తాలు వెచ్చించడం వినియోగదార్లకు కష్టమవుతోంది.
*ద్విచక్ర వాహనాలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తగ్గించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అత్యధికులకు కనీస అవసరంగా మారిన ద్విచక్ర వాహనాలపై జీఎస్‌టీని 18 శాతానికి తగ్గిస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని గత వారం హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌ పవన్‌ ముంజాల్‌ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
*దేశంలో డిజిటల్‌ చెల్లింపుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఆధార్‌ రూపకర్త నందన్‌ నీలేకని ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి అయిదుగురు సభ్యుల కమిటీని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నియమించింది.
*ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ విలువ బాగా పెరిగి ఉన్నందున, 2019 తొలి ఆరు నెలల్లో రెండంకెల దిద్దుబాటుకు ఆస్కారం ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్లించ్‌ (బీఓఎఫ్‌ఏ) అంచనా వేసింది.
* వివిధ మార్కెట్లలో మంగళవారం బం getగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,800, విజయవాడలో రూ.32,550, విశాఖపట్నంలో రూ.32,870, ప్రొద్దుటూరులో రూ.32,450, చెన్నైలో రూ.31,830గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,370, విజయవాడలో రూ.30,020, విశాఖపట్నంలో రూ.30,240, ప్రొద్దుటూరులో రూ.30,070, చెన్నైలో రూ.30,370గా ఉంది.
వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,700, విజయవాడలో రూ.40,000, విశాఖపట్నంలో రూ.39,900, ప్రొద్దుటూరులో రూ.39,800, చెన్నైలో రూ.42,100 వద్ద ముగిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com