అవయవ దానంలో నెంబర్1 తెలంగాణ

ఒక మనిషి ప్రాణం పోయినా అతని లేదా ఆమె అవయవాలు దానం చేస్తే కనీసం నలుగురైదుగురికి ప్రాణాలు పోయవచ్చు. నేత్రాలు, మూత్రపిండాలు, కాలేయం వంటివి బ్రెయిన్‌డెడ్ పేషంట్ల నుంచి సేకరిస్తారు. సకాలంలో అవయవాలు సేకరించడం, అవసరమైన చోటికి ఆగమేఘాల మీద వాటిని తరలించడం ముఖ్యం. ఈ తరహా మరణానంతర అవయవ దానాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2018లో మనరాష్ట్రంలో 160 మంది బ్రెయిన్‌డెడ్ పేషంట్ల నుంచి అవయవాలు సేకరించి అవసరమైనవారికి అమర్చారు. తమిళనాడు (140), మహారాష్ట్ర (135), కర్నాటక (90) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక అంతకుముందరి సంవత్సరంతో పోలిస్తే పెరుగుదల సాధించాయి. తమిళనాడు, కేరళలో అవయవ దానాలు తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ 150 నుంచి 160కి చేరుకుని టాప్‌కు ఎగబాకింది. కాగా తమిళనాడు 160 నుంచి 140కి పడిపోయింది. ప్రజలను చైతన్యపరచడం ఈ విషయంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వైద్యులు అంటున్నారు. పేషంటు బ్రెయిన్‌డెడ్ అయిన వెంటనే కుఉటంబ సభ్యులు నిర్ణయం తీసుకుంచటే అవయవాలు తీసి భద్రపర్చవచ్చు. నేత్రహీనులకు చూపును, కిడ్నీవ్యాధి పీడుతులకు ఉపశమనాన్ని, కాలేయం చెడిపోయినవారికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com