కారు గోడ ఎక్కుతుంది

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హుందాయ్‌ ఓ కొత్త కాన్సెప్ట్ కారుతో ముందుకొచ్చింది. 52వ కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ షో సందర్భంగా దాన్ని ఆవిష్కరించారు. ఈ కారు రోబోటిక్స్‌ కాళ్లతో నడవడంతోపాటు, సులభంగా పాకగలదు కూడా. ఎలక్ట్రిక్‌ వెహికిల్, రోబోటిక్స్ సాంకేతికతలను ఉపయోగించి తయారుచేసిన ఈ కారుతో డ్రైవింగ్, నడవడం, ఎత్తైన ప్రదేశాల్లోకి సులభంగా ఎక్కడం కూడా కుదురుతుంది. కదిలే కాళ్ల సాంకేతిక ఉన్న మొదటి కారు ఇదేనని ఆ కంపెనీ వెల్లడించింది. ఈ కారు ఐదు అడుగుల గోడను కూడా ఎక్కగలదని తెలిపింది. ‘సునామీ, భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాహనాలు శిథిలాలు పడిఉన్నవరకు మాత్రమే వెళ్లగలవు. అయితే ఈ ఎలివేట్ కారు మాత్రం గుట్టలుగా పడి ఉన్న శిథిలాల మీదకు తన కాళ్లను ఉపయోగించి సునాయాసంగా చేరుకోగలదు’ అని కంపెనీ ఉపాధ్యక్షుడు జాన్ సు వెల్లడించారు. ‘అల్టిమేట్ మొబిలిటీ వెహికిల్’ గా పిలిచే ఈ ప్రాజెక్టును మాడ్యులార్‌ ఈవీ ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఆవిష్కరించిన ఎలివేట్‌ పరిస్థితులకు తగ్గట్టుగా వాహన రూపును మార్చుకుంటుందని వివరించారు. మెకానికల్ కాళ్లకు చక్రాలను అమర్చి దాన్ని డిజైన్‌ చేశారు. విపత్తుల సమయంలో ప్రజలను రక్షించడానికి ఈ రోబోటిక్స్‌ సాంకేతిక ఉపయోగపడుతుందని తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com