న్యూజెర్సీలో “కథానాయకుడి” సందడి


నందమూరి బాలకృష్ణ ప్రధాన తారాగణంలో విడుదలయిన “కథానాయకుడు” చిత్రానికి అమెరికాలో మంచి స్పందన లభిస్తోంది. అమెరికావ్యాప్తంగా ఎన్‌టీఆర్, బాలకృష్న, తెదేపా అభిమానులు ఈ చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద భారీగా సందడి చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం న్యూజెర్సీలోని 8K Cinemas థియేటర్ వద్ద జరిగిన ఎన్‌టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సినీనటుడు తారకరత్న పాల్గొని కేక్ కట్ చేసి సినిమాను వీక్షించారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ పరిసర ప్రాంతాల నుండి అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొని తారకరత్నతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. బాలయ్య నటనలో మరో కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరించిందని, సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉందని తారకరత్న పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com