రెవెన్యు అధికారులపై ఇసుక మాఫియా దాడి-నేరవార్తలు–01/10

* సీతానగరం మండలం ముగ్గళ్ళ ఇసుక ర్యాంపుల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుబడ్డ 6.ఇసుక ట్రాక్టర్లు….
డిప్యూటీ ఎమ్మార్వో బాపిరాజు vro నందీశ్వర రావు మీద దాడికి పాల్పడ్డ ఇసుక మాఫియా…..చాకచక్యం గా పట్టుకున్న రెవెన్యూ ఇబ్బంది!స్పేషల్ టాస్క్ఫోర్స్ సిబ్బంది రాత్రులు డ్యూటీచేయకుండా భయపెడుతున్న అధికార పార్టీ కార్యకర్తలు.
* హైదరాబాద్ మెహిదీపట్నం లో స్నేహితుడి పై కత్తి తో దాడి తీవ్రగాయలతో ఉస్మానియా హాస్పిటల్ కు తరలింపు సద్దాం వొద్ద అవసరాల నిమిత్తం 5000 అప్పుతీసుకున్న ఫెరోజ్ సకాలంలో చెలించకపివడంతో ఆవేశనకిలోనై ఫెరోజ్ పై దాడి చేసిన సద్దాం
* సికింద్రాబాద్ పద్మరావు నగర్ లో చైన్ స్నాచింగ్ నడుచుకుంటున్న వెళ్తున్న మహిళ మెడలోనుండి తులం బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు చిలకలగూడా పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ పిర్యాదు కేసు నమోదు
* విజయనగరంఎల్.కోట స్మశాన వాటికలో ఇంటర్ విద్యార్థిని మృతదేహం.ఎస్.కోట లోని ప్రయివేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పి.శ్యామల గా గుర్తింపు. స్థానికంగా కలకలం. మృతురాలు ఎల్.కోట మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన శ్యామల. సంఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్.
*నెల్లూరు జిల్లా పత్రికా విలేకరి పై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద ను సస్పెండ్ చేసిన ఎస్పి ఐశ్వర్య రస్తోగి.
*విశాఖ జిల్లా యరాడా మార్గంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ పిల్లల బస్సు అగ్నికి ఆహుతి..తృటిలో తప్పించుకున్న విద్యార్థులు.పాఠశాల యాజమాన్యం నిర్ణయం మేరకు పిక్నిక్ కు గంగవరం రోడ్డు మార్గంగుండా యరాడా కు వెళ్తున్న సమయంలో బుస్స్ ఇంజన్ లో సాంకేతిక లోపంవలన చేలారిగిన మంటలు. డ్రైవర్ అప్రమత్తం కారణంగ తప్పిన ప్రాణ నష్టం
*ఆస్ట్రేలియాలో అనుమానాస్పద పొట్లాల కలకలం
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌, కాన్‌బెర్రా నగరాల్లో భారత్‌ సహా పలు దేశాల దౌత్య కార్యాలయాలకు అనుమానాస్పద పొట్లాలు రావడం బుధవారం కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో భారత్‌, అమెరికా దౌత్య కార్యాలయాలకు ఈ పార్శిళ్లు రావడంతో అప్రమత్తమయ్యారు. పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో తెల్లటి చూర్ణం ఉందని, ‘అస్‌బెస్టాస్‌’ అని రాసి ఉందని తెలుస్తోంది.
*బహ్రెయిన్‌లో నిజామాబాద్‌ జిల్లా వాసి ఆత్మహత్య
వ్యవసాయం గిట్టుబాటు కాక అప్పుల పాలైన ఓ యువ రైతు ఉపాధి కోసం బహ్రెయిన్‌ వెళ్లి అక్కడ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేతనం తక్కువ ఉందని మానసిక ఆందోళనతో గదిలోనే ఉరి వేసుకున్నాడు. మృతుని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం కొత్తకోరుట్ల గ్రామానికి చెందిన బాదావత్‌ గణేశ్‌(25) వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో 25 రోజుల క్రితం బహ్రెయిన్‌ దేశానికి వెళ్లాడు. వేతనం తక్కవగా ఉందని.. అప్పులు తీర్చే మార్గం లేదని రోజు మదన పడుతుండేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఒంట్లో నలతగా ఉందని పనికి రాలేనని తన సహచరులకు చెప్పాడు. ఈ క్రమంలో తన సహచరులు విధులు ముగించుకుని వచ్చే సరికి గణేశ్‌ ఉరి వేసుకొని విగతజీవిగా గదిలో పడి ఉన్నాడు. దీంతో వారు కుటుంబసభ్యులకు తెలియజేయడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుని భార్య గర్భవతి. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
*లారీ ఢీకొని ఇద్దరు యువకుల మృతి
ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఖమ్మం గ్రామీణం మండలంలోని కరుణగిరి వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామన్నపేట కాలనీకి చెందిన యాకుబ్‌(30), శ్రీకాంత్‌(29) కలిసి ద్విచక్ర వాహనంపై తాపీ పనికి కాచిరాజుగూడెంకు వెళ్తున్నారు. మార్గంమధ్యలో కరుణగిరి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఎస్సై యాదగిరి రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
*3.3 కిలోల బంగారం పట్టివేత
గువహటి – సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఈ నెల 4వ తేదీన దాడులు చేసి రూ.1.08 కోట్ల విలువైన 3.314 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విశాఖ డీఆర్‌ఐ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రైలు విశాఖ రైల్వేస్టేషన్‌కు వచ్చినప్పుడు దాడులు నిర్వహించామన్నారు. ఇద్దరు నిందితులు తమ బనియన్లకు ప్రత్యేకంగా జేబులు కుట్టించుకుని, అందులో బంగారు బిస్కెట్లను తీసుకెళ్తున్నారని వివరించారు.
*యువతి హత్య కేసులో 2 జీవిత ఖైదులు
తనను నిర్లక్ష్యం చేస్తోందనే అక్కసుతో ఓ యువతిని అత్యంత కిరాతకంగా హత్యచేసిన నేరం రుజువుకావడంతో నిందితుడికి రెండు జీవితఖైదు శిక్షలు విధిస్తూ విశాఖపట్నంలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక న్యాయస్థానం న్యాయమూర్తి ఒ.వి.నాగేశ్వరరావు బుధవారం తీర్పు ఇచ్చారు.
*చోరీ సొత్తుతో పరారవుతుండగా పట్టివేత
చెన్నైలోని ఒక దుకాణంలో చోరీ చేసిన బంగారు ఆభరణాలను దొంగలు రైలులో తీసుకెళుతుండగా విజయవాడ ఆర్పీఎఫ్‌ పోలీసులు గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను విజయవాడకు తీసుకువచ్చారు. విజయవాడ రైల్వే ముఖ్య భద్రతాధికారి ఎస్‌ఆర్‌ గాంధీ వివరాలప్రకారం.. చెన్నైలోని ఒక పసిడి దుకాణం నుంచి 13.5 కిలోల బంగారం, 67 కిలోల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదు చోరీకి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
*అవినీతి సొత్తుతో మహిళలకు వల
అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున అక్రమాస్తులను కూడబెట్టిన ఉద్యోగి… ఆ సొత్తుతో విలాసవంతమైన జీవితం గడుపుతూ మహిళలు, బాలికలకు వలపు వల వేసినట్లు తేలింది. దాదాపు 40 మంది మహిళలు, బాలికలపై ఇటీవల ఏసీబీకి చిక్కిన ఏలూరు గ్రామీణ నీటి సరఫరా విభాగం జూనియర్‌ అసిస్టెంట్‌ రాంపల్లి దివాకర్‌ వల వేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఖరీదైన కానుకలు ఇవ్వడం, మాయమాటలు చెప్పడంద్వారా వారిని ఉచ్చులోకి లాగినట్లు తెలుస్తోంది.
*అక్రమార్కుల్లో వణుకు పుట్టిస్తున్న చీతా
అటవీశాఖలో ప్రవేశపెట్టిన జర్మన్‌ షెపర్డ్‌ జాగిలం ‘చీతా’ అక్రమార్కులకు వణుకు పుట్టిస్తోంది. వేట మాంసాన్ని అయినా, అక్రమంగా కలప నిల్వ ఉంచినా ఇట్టే పట్టేస్తోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలోని చింతగూడలో రూ.54వేలు, బొమ్మెన గ్రామంలో రూ.మూడు వేల విలువైన కలపను పట్టించడంలో కీలకంగా వ్యవహరించింది.
*విమానాశ్రయంలో భారీగా విదేశీ నగదు పట్టివేత
అక్రమంగా దుబాయికి పెద్దమొత్తంలో విదేశీ నగదు(కరెన్సీ)ను తరలిస్తూ ఓ ప్రయాణికుడు భద్రతాధికారులకు పట్టుబడిన ఘటన బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ పర్వేజ్‌ శంషాబాద్‌ నుంచి ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ ఈకే 525 విమానంలో దుబాయి వెళుతున్నాడు. దాదాపు రూ.కోటి విలువైన 7 గల్ఫ్‌ దేశాలకు చెందిన నోట్ల కట్టలను తన సామగ్రిలో రహస్యంగా దాచుకొని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన యంత్రాల సహాయంతో భద్రతాధికారులు చేపట్టిన తనిఖీలో విదేశీ కరెన్సీ వెలుగు చూసింది. సదరు కరెన్సీకి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పర్వేజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
*జీఎస్టీ ఎగవేత కేసులో రిసార్ట్స్‌ సీఎండీ అరెస్టు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూ.13.81 కోట్లు ఎగవేసినందుకు ఓ రిసార్ట్స్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ను అరెస్టు చేసినట్లు డీజీజీఐ హైదరాబాద్‌ జోనల్‌ విభాగం అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం రిసార్ట్స్‌ సీఎండీని అరెస్టు చేయగా ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్‌ విధించినట్లు పేర్కొన్నారు.
*గొలుసు దొంగలు దొరికారు
వరుస గొలుసు దొంగతనాలతో హైదరాబాద్‌లో కలకలం రేపి, మహిళలు బయటకు రావాలంటేనే భయపడేలా చేసిన గొలుసు దొంగలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నోయిడా నివాసి మోనూవాల్మీకి, బులంద్‌షహర్‌లో ఉంటున్న చోకా, హైదరాబాద్‌కు చెందిన చింతమళ్ల ప్రణీత్‌చౌదరిలు 14రోజుల క్రితం నగరంలో 19 గంటల వ్యవధిలో 11 మంది మహిళల మెడల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు అధికారులు రాచకొండ ఎస్‌ఓటీ పోలీసుల సహకారంతో దిల్లీ, నోయిడా, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లకు వెళ్లి ఆధారాలు సేకరించారు.
*ఇద్దరు అటవీ అధికారుల అరెస్టు
నిర్మల్‌ జిల్లా కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు పరిధిలో వన్యప్రాణుల వేటకు సంబంధించి ఇద్దరు అటవీ అధికారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నీల్గాయిని వేటాడి చంపిన ఘటనకు సంబంధించి దాని మాంసాన్ని డిసెంబరు 31న గుగ్లావత్‌ ప్రకాశ్‌ ఇంట్లో పట్టుకున్నారు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు నిందితులకు సహకరించాడన్న అనుమానంతో పెంబి ఎఫ్‌ఆర్‌ఓ ఎండీ హఫీజుద్దీన్‌పై అటవీశాఖ ఇప్పటికే సస్పెన్షన్‌ వేటు వేసింది.
*సూట్‌కేసులో యువతి మృతదేహం..
దేశ రాజధాని నగరంలోని అశోక్‌నగర్‌ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని దారుణంగా హత్యచేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమె మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కారు. అనంతరం దాన్ని ధర్మశిలా రోడ్‌లోని ఓ కాలువ వద్ద పడేసి వెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
*కారు బీభత్సానికి నవ వధువు బలి
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని పాపిరెడ్డి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఓ కారు బీభత్సం సృష్టించింది. బస్సు కోసం వేచి ఉన్న ఒకే కుటుంబానికి చెందినవారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com