తడాఖా చూపిస్తున్న సీబీఐ డైరెక్టర్–తాజావార్తలు–01/10

* సీబీఐ డైరెక్టర్‌గా బుధవారం తిరిగి నియమితులైన అలోక్‌వర్మ ఇవాళ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. తాజాగా బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేశన్, ఏడీ ఏకే శర్మ తదితరులు ఉన్నారు. పరిపాలనా విభాగం డిప్యూడీ డైరెక్టర్‌ అనీశ్ ప్రసాద్ యథావిధిగా తన స్థానంలోనే ఉండగా… నిఘా విభాగాన్ని పర్యవేక్షించే యూనిట్ 1 బాధ్యతలను కేఆర్ చౌరాసియాకి అప్పగించారు.కాగా తాను సెలవులో ఉన్న సమయంలో తాత్కాలిక డైరెక్టర్‌ ఎం.నాగేశ్వర్‌రావు చేపట్టిన బదిలీలను వర్మ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
* తమిళనాడులోని తిరుకోవిలూర్ లో ‘విశ్వాసం’ సినిమా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. కోలీవుడ్ హీరో అజిత్ అభిమానులు విల్లుపురం థియేటర్ వద్ద 30 అడుగుల పొడవైన భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. కటౌట్ పైకి ఎక్కి పాలాభిషేకం చేస్తుండగా..అది ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. కటౌట్ కిందున్న వారికి కూడా స్వల్పగాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స కోసం తిరుకోవిలూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
* భార‌త సైనిక ద‌ళం సాంప్ర‌దాయ‌క‌మైంద‌ని, అందులోకి స్వ‌లింగ సంప‌ర్కుల‌ను తీసుకోలేమ‌ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ తెలిపారు.
గ‌త ఏడాది సుప్రీంకోర్టు గే సెక్స్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ప్పుడు ఆయ‌న ఈ స‌మాధానం ఇచ్చారు. ఇక్క‌డ అలాంటివి న‌డ‌వ‌వు అన్నారు. మ‌నం ఆధునీక‌ర‌ణ చెంద‌లేద‌ని, పాశ్చాత్యంగా కూడా మార‌లేద‌ని, ఎల్జీబీటీ స‌మ‌స్య‌ల‌ను ఇక్క‌డ మ‌నం ఆమోదించ‌లేమ‌ని బిపిన్ రావ‌త్ స్ప‌ష్టం చేశారు. ఆర్మీ యాక్టు ప్ర‌కారం ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఒక‌వేళ మ‌న‌కు ఆఫ్ఘ‌నిస్తాన్‌పై ఆస‌క్తి ఉంటే, అప్పుడు తాలిబ‌న్ అంశాన్ని కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంద‌న్నారు.
*వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.32,940, విజయవాడలో రూ.32,630, విశాఖపట్నంలో రూ.32,960, ప్రొద్దుటూరులో రూ.32,500, చెన్నైలో రూ.31,970గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,500, విజయవాడలో రూ.30,250, విశాఖపట్నంలో రూ.30,320, ప్రొద్దుటూరులో రూ.30,140, చెన్నైలో రూ.31,510గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,100, విజయవాడలో రూ.40,300, విశాఖపట్నంలో రూ.40,200, ప్రొద్దుటూరులో రూ.40,100, చెన్నైలో రూ.42,500 వద్ద ముగిసింది.
*యరాడా మార్గంలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ పిల్లల బస్సు అగ్నికి ఆహుతి..తృటిలో తప్పించుకున్న విద్యార్థులు.
పాఠశాల యాజమాన్యం నిర్ణయం మేరకు పిక్నిక్ కు గంగవరం రోడ్డు మార్గంగుండా యరాడా కు వెళ్తున్న సమయంలో బుస్స్ ఇంజన్ లో సాంకేతిక లోపంవలన చేలారిగిన మంటలు.డ్రైవర్ అప్రమత్తం కారణంగ తప్పిన ప్రాణ నష్టం.
*మహబూబాబాద్ లోని జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంపై ఏ సి బి దాడులు, 10 వేళా లంచం తీసుకుంటున్న జిల్లా పరిశ్రమల అధికారి వీరేషమును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.
*లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 2019-20వ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కాకుండా తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు 14 రోజుల పాటు జరగనున్నాయని, ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెడతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 31న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. అదే రోజున ఆర్థిక సర్వేను సభలో ప్రవేశపెడతారు. దీనిపై హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని పార్లమెంటు వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఇంకా తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన తరువాతనే బడ్జెట్‌ సమావేశాలపై నిర్ణయం వెలువడుతుంది.2
*దేవాదుల ఎత్తిపోతల పథకం అంచనా వ్యయం మరింత పెరిగింది. తాజా అంచనా ప్రకారం రూ. 13,445 కోట్ల నుంచి రూ. 16,645.44 కోట్లకు చేరింది. 2004లో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పూర్తి కాకపోగా ఎప్పటికప్పుడు నిర్మాణం వ్యయం పెరుగుతోంది.
*అయోధ్య భూ వివాదంపై విచారణకు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి తీసుకున్న నిర్ణయం న్యాయవర్గాలను ఆశ్చర్య పరిచింది. ఇలాంటి నిర్ణయం న్యాయ చరిత్రలో తొలిసారి కావడమే ఇందుకు కారణం. జస్టిస్‌ గొగొయితో పాటు, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం గురువారం నుంచి ఈ కేసుపై విచారణ జరపనుంది.
*సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ కుమార్‌ వర్మ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి విధానపరమైన నిర్ణ్ణయాలు తీసుకోకుండా సాధారణ విధులకే పరిమితం కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో ఆయన తాను లేనప్పుడు జరిగిన బదిలీలను దాదాపుగా రద్దు చేశారు. తాను 77 రోజులపాటు నిర్బంధ సెలవులో ఉన్నప్పుడు తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న ఎం.నాగేశ్వరరావు జారీ చేసిన బదిలీ ఉత్తర్వులు అన్నింటినీ రద్దు చేశారు. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తున్న డీఎస్‌పీ ఎ.కె.బస్సి, డీఐజీ ఎం.కె.సిన్హా, జేడీ ఎ.కె.శర్మల బదిలీలను రద్దు చేశారని తెలిసింది.
*ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్నందున రిజర్వాయర్లలో నీటి నిల్వలు సరిపడా లేవని, అందువల్ల చెన్నై తాగునీటి అవసరాలకు ప్రస్తుతం నీటిని విడుదల చేయలేమని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేసింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ప్రస్తుత తమ అవసరాలను పరిగణనలోకి తీసుకొని మార్చిలో కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొంది. 1983లో జరిగిన ఒప్పందం ప్రకారం చెన్నైకు 15 టీఎంసీల తాగునీటి సరఫరాపై చర్చించేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ బుధవారం హైదరాబాద్‌లో సమావేశమైంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, తమిళనాడు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు మురళీధర్‌, భక్తవత్సలం, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల నుంచి చీఫ్‌ ఇంజినీర్లు మురళీనాథరెడ్డి, ముండే పాల్గొన్నారు. కర్ణాటక నుంచి హాజరుకాలేదు. ఒప్పందం ప్రకారం 15 టీఎంసీలు తమిళనాడుకు విడుదల చేయాలని, ఆవిరయ్యే నీరు పోనూ తమిళనాడు సరిహద్దుకు 12 టీఎంసీలు చేరాల్సి ఉందని కమిటీ ఛైర్మన్‌ జైన్‌ స్పష్టం చేశారు.
*కశ్మీర్‌లో వరుస హత్యలను, ముస్లింలపై వివక్షను నిరసిస్తూ… 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ టాపర్‌ షా ఫైసల్‌ (35) బుధవారం తన సర్వీసుకు రాజీనామా చేశారు. విదేశాల్లో శిక్షణ పూర్తిచేసుకుని ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ప్రస్తుతం పోస్టింగ్‌ కోసం నిరీక్షిస్తున్నారు. శుక్రవారం ఆయన తన భవిష్యత్‌ కార్యాచరణను వెల్లడిస్తారని తెలిసింది. అయితే, ఫైసల్‌ ‘నేషనల్‌ కాన్ఫరెన్స్‌’లో చేరి, వచ్చే ఎన్నికల్లో బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం. రాజీనామా విషయాన్ని బుధవారం ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో వెల్లడించారు. ‘‘కశ్మీర్‌లో హత్యాకాండ నిరాటంకంగా కొనసాగుతోంది. వీటి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయడంలేదు. భారతీయ ముస్లింలు హిందుత్వ శక్తుల చేతిలో వివక్షకు, అణచివేతకు గురవుతున్నారు. వారిని ద్వితీయశ్రేణి పౌరులుగా చూస్తున్నారు. జమ్ము-కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక అస్థిత్వంపై పరోక్ష దాడి జరుగుతోంది. వీటన్నింటిపై పోరాడేందుకు వీలుగా సివిల్‌ సర్వీస్‌ను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. ఫైసల్‌ రాజీనామాను నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, హురియత్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఉమర్‌ ఫరూఖ్‌లు స్వాగతించారు.
*విజయవాడ పుస్తక మహోత్సవం గడువును మరో రెండు రోజులు పొడిగించారు. ఈ నెల ఒకటిన ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన 11తో ముగియాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను 12 నుంచి ప్రకటించడంతో పుస్తక ప్రియుల కోరిక మేరకు ప్రదర్శన గడువును రెండు రోజుల పాటు పొడిగిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో 12, 13వ తేదీల్లోనూ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకూ కొనసాగనుంది. 12న సాయంత్రం 5.30 గంటలకు పుస్తక మహోత్సవ ప్రాంగణంలోని వేదికపై ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ ముఖాముఖి ఏర్పాటు చేశారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2, పంచాయతీ కార్యదర్శి, ఏఈఈ తదితర పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.
*నాలుగైదు రోజులుగా కాస్త తగ్గిన చలి మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతంనుంచి శీతల గాలులు వీస్తున్న కారణంగా రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ‘శీతల గాలుల ఉద్ధృతి కారణంగా పలు ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోందని, తెల్లవారుజామున వాహనాల్లో ప్రయాణం శ్రేయస్కరం కాదని’ ఆయన సూచించారు. బుధవారం తెల్లవారు జామున కుమురం భీం జిల్లా గిన్నెదరిలో 4.9, సిర్పూరు(యు)లో 5.2, సంగారెడ్డి జిల్లా అల్గోల్‌లో 5.4, ఆదిలాబాద్‌ జిల్లా బజారుహత్నూర్‌లో 6, కామారెడ్డి జిల్లా లచ్చపేటలో 6.2, రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో 7, శంకర్‌పల్లిలో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, గురు, శుక్రవారాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని రాజారావు వివరించారు.
*సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్‌ కుమార్‌ వర్మ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎలాంటి విధానపరమైన నిర్ణ్ణయాలు తీసుకోకుండా సాధారణ విధులకే పరిమితం కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దాంతో ఆయన తాను లేనప్పుడు జరిగిన బదిలీలను దాదాపుగా రద్దు చేశారు.
*తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం తెలిపారు.
*యాసంగి సాధారణంకన్నా లక్ష ఎకరాల వరకు తక్కువగా ఉందని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. యాసంగి సీజన్‌ మొత్తం సాధారణ విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు. అన్ని పంటలూ కలిపి బుధవారం వరకు సాధారణ విస్తీర్ణం 15.27 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలి.
*సంక్రాంతి రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు సర్వీసులను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సిద్ధమయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బుధవారం తన స్వస్థలం వెంకటాచలం నుంచి రేణిగుంట స్టేషన్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విజయవాడ డీఆర్‌ఎం ఆర్‌.ధనుంజయులు సహా పలువురు రైల్వే అధికారులతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు.
* సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆదేశించారు. వేడుకల నిర్వహణపై బుధవారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వేడుకలకు అవసరమైన పోలీసు బందోబస్తు, అతిథులకు సౌకర్యాలు, ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
* కేంద్రప్రభుత్వం ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ… సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక ఆందోళన బుధవారం రెండో రోజు కూడా కొనసాగింది. వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగడంతో, ఎస్‌బీఐ మినహా అన్ని బ్యాంకుల్లోనూ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.
*లక్ష తెలంగాణ వ్యావహారిక భాషా పదాలతో కూడిన పదకోశాన్ని జూన్‌ 2నాటికి తెస్తామని ఓరుగల్లు జానపద గిరిజన విజ్ఞాన పీఠం అధిపతి ఆచార్య భట్టు రమేష్‌నాయక్‌ తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పదాలను సేకరిస్తున్నామన్నారు. ఇప్పటికే తాము 15 వేల పదాలను సేకరించామన్నారు. నిఘంటువును రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా విడుదల చేసేందుకు తెలుగు విశ్వవిద్యాలయం కృషి చేస్తోందన్నారు.
*ఏపీ రాష్ట్ర సంగీత నృత్య అకాడమీకి ఛైర్మన్‌గా వందేమాతరం శ్రీనివాస్‌ను నియమిస్తూ పర్యాటక, సాంస్కృతికశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి ముఖేష్‌కుమార్‌ మీనా బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
*నాలుగు రోజుల ముందుగానే సచివాలయానికి సంక్రాంతి పండుగ శోభ వచ్చింది. సంక్రాంతి విశిష్టతను తెలిపే రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, బసవన్నల నృత్యాలు, కోలాటాలు, కబడ్డీ పోటీలతో సచివాలయ ప్రాంగణం బుధవారం సందడిగా మారింది. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగినులకు ముగ్గుల పోటీలు, పురుషులకు కబడ్డీ పోటీలో నిర్వహించారు.
*రానున్న ఆర్థిక సంవత్సరంలో (2019-20)లో రూ.24,463.66 కోట్ల వ్యయ అంచనాలతో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) బడ్జెట్‌ను రూపొందించింది. ఇందులో పరిశ్రమలు, గృహ, ఇతర వినియోగదారులతోపాటు వివిధ వర్గాలకు విద్యుత్తు సరఫరా ద్వారా రూ.17,141.87 కోట్ల ఆదాయం సమకూర్చుకోనుంది.
*ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి శారీరక కొలతలు, దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 12న సివిల్‌ ఎస్సై, ఏఆర్‌, ఏపీఎస్పీ ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి ప్రాథమిక రాత పరీక్ష జరిగిన సంగతి విదితమే. దీనిలో 51,926 మంది అభ్యరులు అర్హత సాధించారు. వీరికే శారీరక కొలతలు, దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
*జనవరి 2 నుంచి 11 వరకు జరిగే జన్మభూమి -మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు సెలవులు ఇచ్చింది. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రత్యేక సాధారణ సెలవు దినాలు మంజూరు చేసినట్లు రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12 నుంచి సంక్రాంతి సెలవులు మొదలవుతున్నాయి ప్రత్యేక సాధారణ సెలవులు, అనంతరం వచ్చే శని, ఆదివారాలు కలిపితే జనవరి 20 వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులే.
*డీఎస్సీ-2018 సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు(ఎస్జీటీ), ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయుల పరీక్షలు ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి బుధవారం తెలిపారు. హాల్‌టిక్కెట్లు, పరీక్షల రోజువారీ షెడ్యూల్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆమె వెల్లడించారు. గురువారం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.
*సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ ఈ నెల 22 నుంచి నిరవధిక సమ్మెను చేపడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ 104 ఒప్పంద ఉద్యోగుల సంఘం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య గత ఏడాది మే ఒకటిన కుదిరిన ఒప్పందం మేరకు.. జీవో 151 ప్రకారం వేతనాలు చెల్లించేలా వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు నేటివరకూ అమలుకాలేదని సంబంధిత సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.ఉద్యోగుల అనవసర బదిలీలు, తొలగింపులు రద్దుచేయాలని, అదనపు పని గంటలకు ప్రత్యేకంగా పారితోషికం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది.
*లక్ష తెలంగాణ వ్యావహారిక భాషా పదాలతో కూడిన పదకోశాన్ని జూన్‌ 2నాటికి తెస్తామని ఓరుగల్లు జానపద గిరిజన విజ్ఞాన పీఠం అధిపతి ఆచార్య భట్టు రమేష్‌నాయక్‌ తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పదాలను సేకరిస్తున్నామన్నారు. ఇప్పటికే తాము 15 వేల పదాలను సేకరించామన్నారు. నిఘంటువును రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా విడుదల చేసేందుకు తెలుగు విశ్వవిద్యాలయం కృషి చేస్తోందన్నారు.
*రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర విజయంతో ముగించింది. బుధవారం ముగిసిన రంజీ ట్రోఫీ గ్రూప్‌-బి చివరి లీగ్‌ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ను చిత్తుగా ఓడించింది. పేసర్‌ శశికాంత్‌ (6/18) కొత్త బంతితో నిప్పులు చెరగడంతో మరో రోజు మిగిలివుండగానే ఆంధ్ర 307 భారీ ఆధిక్యంతో మధ్యప్రదేశ్‌పై ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 198/7తో మూడో రోజు ఉదయం ఆట కొనసాగించిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 101.1 ఓవర్లలో 301 పరుగులకు ఆలౌటైంది. కరణ్‌ షిండే (103 నాటౌట్‌; 215 బంతుల్లో 16×4) అజేయ సెంచరీతో రాణించాడు. అనంతరం 343 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన మధ్యప్రదేశ్‌.. శశికాంత్‌, విజయ్‌కుమార్‌ (3/17)ల దెబ్బకు చేతులెత్తేసింది. 16.5 ఓవర్లలో 35 పరుగులకే కుప్పకూలింది. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించారు. ఐదుగురు డకౌటయ్యారు. ఆంధ్ర రంజీ క్వార్టర్స్‌ రేసు నుంచి ముందే నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
*ప్రిమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ నాలుగో సీజన్‌ లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లను సింధు విజయంతో.. సైనా ఓటమితో ముగించారు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సింధు గెలిచినా.. హైదరాబాద్‌ హంటర్స్‌కు పరాజయం తప్పలేదు. హంటర్స్‌ 3-4 తేడాతో దిల్లీ డాషర్స్‌ చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో హంటర్స్‌ ఆటగాడు రాహుల్‌ 10-15, 15-9, 12-15తో ప్రణయ్‌ చేతిలో ఓడాడు. దిల్లీ ట్రంప్‌ మ్యాచ్‌గా ఎన్నుకొన్న పురుషుల డబుల్స్‌లోనూ హంటర్స్‌కు చుక్కెదురైంది.
* తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి ఎల్లప్పుడూ పట్టం కట్టే ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం(టాంటెక్స్‌ ) 2019 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 6న డల్లాస్‌లో జరిగిన గవర్నింగ్‌ బోర్డు సమావేశంలో ప్రకటించారు. టాంటెక్స్‌ అధ్యక్షుడుగా వీర్నపు చినసత్యం బాధ్యతలు స్వీకరించారు.ఉపాధ్యాక్షులుగా కోడూరు కృష్ణా రెడ్డి, పాలేటి లక్ష్మీలలను నియమించగా, కార్యదర్శిగా పార్నపల్లి ఉమా మహేష్‌, సంయుక్త కార్యదర్శిగా తోపుదుర్తి ప్రభంద్‌ రెడ్డి, కోశాధికారిగా ఎర్రం శరత్‌, సంయుక్త కోశాధికారిగా బొమ్మ వెంకటేష్‌, తక్షణ పూర్వాధ్యక్షులుగా శీలం కృష్ణ వేణిలను ఎన్నుకున్నారు. అదే విధంగా పాలక మండలి బృంధాన్ని కూడా ఈ సమావేశంలో ప్రటించారు. పాలకమండలి అధిపతిగా ఎన్‌. ఎం. యస్‌.రెడ్డి, ఉపాధిపతిగా నెల్లుట్ల పవన్‌ రాజ్‌లను ఎన్నుకున్నారు. సభ్యులుగా కన్నెగంటి చంద్రశేఖర్‌, కొనార రామ్‌, మందాడి ఇందు రెడ్డి, ఎర్రబోలు దేవేందర్‌, డా. పామడుర్తి పవన్‌లను సంస్థ ఎన్నుకుంది.ఈ సందర్భంగా టాంటెక్స్‌ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ.. టాంటెక్స్‌ లాంటి గొప్ప సంస్థకి 33వ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో కాజ చంద్రశేఖర్‌, మండిగ శ్రీలక్ష్మీ, మనోహర్‌ కసగాని, జొన్నల శ్రీకాంత్‌ రెడ్డి, కొండా మల్లిక్‌, మెట్టా ప్రభాకర్‌, తాడిమేటి కల్యాణి, లంక భాను, ఇల్లెందుల సమీర, బండారు సతీష్‌, చంద్రా రెడ్డి పోలీస్‌, యెనికపాటి జనార్దన్, కొనిదాల లోకేష్‌ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
* భార‌త సైనిక ద‌ళం సాంప్ర‌దాయ‌క‌మైంద‌ని, అందులోకి స్వ‌లింగ సంప‌ర్కుల‌ను తీసుకోలేమ‌ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావ‌త్ తెలిపారు.
గ‌త ఏడాది సుప్రీంకోర్టు గే సెక్స్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ఆ విష‌యాన్ని ప్ర‌స్తావించిన‌ప్పుడు ఆయ‌న ఈ స‌మాధానం ఇచ్చారు. ఇక్క‌డ అలాంటివి న‌డ‌వ‌వు అన్నారు. మ‌నం ఆధునీక‌ర‌ణ చెంద‌లేద‌ని, పాశ్చాత్యంగా కూడా మార‌లేద‌ని, ఎల్జీబీటీ స‌మ‌స్య‌ల‌ను ఇక్క‌డ మ‌నం ఆమోదించ‌లేమ‌ని బిపిన్ రావ‌త్ స్ప‌ష్టం చేశారు. ఆర్మీ యాక్టు ప్ర‌కారం ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. ఒక‌వేళ మ‌న‌కు ఆఫ్ఘ‌నిస్తాన్‌పై ఆస‌క్తి ఉంటే, అప్పుడు తాలిబ‌న్ అంశాన్ని కూడా ప‌రిశీలించాల్సి ఉంటుంద‌న్నారు


More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com