విమాన ప్రయాణీకులకు యాభై లక్షల బీమా–వాణిజ్య-01/10

*ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌కు చెందిన ఇండిగో దేశీయ విమాన టికెట్లను రూ.899(అన్నీ కలిపి) నుంచి; అంతర్జాతీయ విమాన టికెట్లను రూ.3399(అన్నీ కలిపి) నుంచి పరిమిత ప్రయాణ కాలానికి అందజేస్తోంది.
* విమాన ప్రయాణికులకు శుభవార్త. తమ ద్వారా విమాన టికెట్లు బుక్‌ చేసుకునే వారికి రూ.50 లక్షల వరకు ఉచిత ప్రయాణ బీమా సౌకర్యాన్ని రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ కల్పిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లోని అన్ని రకాల టికెట్లకు ఈ సదుపాయం వర్తిస్తుందని ఐఆర్‌సీటీసీ బుధవారం తెలిపింది.
* పసిడి నగదీకరణ పథకంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు.. వాటి ఆధీనంలోని సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు కూడా అవకాశం కల్పిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం తీసుకుంది.
*హైదరాబాద్‌లో జీఎంఆర్‌ గ్రూపు నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణలో భాగంగా, కొత్తగా 26 విమాన పార్కింగ్‌ స్టాండ్లను నిర్మించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 7.3 శాతం మేర వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంకు తన అంచనాల్లో పేర్కొంది. వినియోగం, పెట్టుబడులు పుంజుకుని వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాలలో 7.5 శాతం చొప్పున వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేసింది.
*భారత ప్రమాణాల బ్యూరో (బీఐఎస్‌) దగ్గర నమోదు కాకుండా దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్‌, ఐటీ పరికరాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.
*బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర మళ్లీ 60 డాలర్లను తాకింది. మూడున్నర వారాల తర్వాత తిరిగి ఈ స్థాయికి చేరింది. ప్రామాణిక చమురు కాంట్రాక్టుగా భావించే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ బుధవారం 60.05 డాలర్ల వద్ద గరిష్ఠ స్థాయిని చేరాక.. మళ్లీ 59.79 డాలర్లకు దిగివచ్చింది.
*ఆదాయపు పన్ను మినహాయింపు పరిధిని రూ.5,00,000కు పెంచాలని ప్రభుత్వానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) విన్నవించింది. ప్రస్తుతం రూ.2,50,000 వరకు వార్షిక ఆదాయం ఉంటే పన్ను మినహాయింపు లభిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని రెట్టింపు చేయాలని సీఐఐ కోరింది.
*బజాజ్‌ కార్ప్‌ ఈ ఆర్థిక సంవత్సరం (2018-19) మూడో త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.60.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2017-18 ఇదే కాలంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.55.16 కోట్లతో పోలిస్తే ఇది 9 శాతం అధికం.
*ప్రభుత్వ శాఖలు విద్యుత్‌ వాహనాలు సమీకరించాలన్న విధానంతో ఆ వాహనాల తయారీకి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం అంద[డంతో పాటు కాలుష్యం కూడా అదుపులోకి వస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు.
*రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌తో బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)ల ప్రతినిధులు సమావేశమయ్యారు.
*చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌ వేతనాన్ని టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ భారీగా పెంచింది. 2018లో ఆయన మొత్తం 15.7 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.110 కోట్లు) అందుకున్నారు.
*ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ అంచనాలు అందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.985.03 కోట్లుగా నమోదైంది.
*హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అగ్రశ్రేణి ఔషధ తయారీ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌, చైనా విపణిపై దృష్టి సారించింది.
*అమెరికాతో పోలిస్తే కెనడా, బ్రిటన్‌లపై భారత్‌ సహా ప్రపంచ దేశాల ఉద్యోగార్థులు ఆసక్తి కనబరుస్తున్నారని అంతర్జాతీయ ఉద్యోగ వెబ్‌సైట్‌ ఇండీడ్‌ తన నివేదికలో పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com