మరో మహిళా శక్తి

‘మహానటి’తో నటిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు కీర్తి సురేష్‌. ఈ మూవీ తరువాత ఇప్పటివరకు మరే తెలుగు ప్రాజెక్ట్‌ను కీర్తి సురేష్‌ ప్రకంటించలేదు. తమిళ్‌ డబ్బింగ్‌ సినిమాలైన సామి, పందెంకోడి2, సర్కార్‌ సినిమాలతోనే టాలీవుడ్‌ను పలకరించింది. అయితే తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్‌ ప్రాజెక్ట్‌ను తెలుగులో చేయనున్నట్లు ప్రకటించారు. మహేష్‌ కోనేరు నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనుండగా.. కళ్యాణీ మాలిక్‌ సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌పై తెరకెక్కనున్న ఈ చిత్రంతో నరేంద్ర అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com